Wednesday, 28 Oct 2026
28 Oct 2026Wednesday
⌕
Home   Reporter Profile
🔴 BREAKING
● రాజాపూర్‌లో పిచ్చికుక్క బీభత్సం.. ఐదుగురికి గాయాలు● రూ.85 లక్షల ఇంటిపై వివాదం.. న్యాయం చేయాలని బాధిత దంపతుల వేడుకోలు● లద్నాపూర్‌లో మినరల్ వాటర్ ప్లాంట్ ప్రారంభించిన మంత్రి శ్రీధర్ బాబు● ప్రజలకు మేలు చేయడమే ప్రజా ప్రభుత్వ లక్ష్యం: మంత్రి శ్రీధర్ బాబు● మార్కెట్ కమిటీ చైర్మన్ వైనాల రాజు కుటుంబాన్ని పరామర్శించిన మంత్రి శ్రీధర్ బాబు● భారీ వర్షంలోనూ వైభవంగా విజయనగరం పైడితల్లమ్మ సిరిమానోత్సవం● రోడ్డు ప్రమాదంలో మార్షల్ ఆర్ట్స్ విద్యార్థులకు తీవ్ర గాయాలు● మాజీ సర్పంచ్ రాకేష్ తండ్రి మృతి పట్ల సంతాపం తెలిపిన డాక్టర్ దూదిపాల వేణుధర్ రెడ్డి● రాజాపూర్‌లో పిచ్చికుక్క బీభత్సం.. ఐదుగురికి గాయాలు● రూ.85 లక్షల ఇంటిపై వివాదం.. న్యాయం చేయాలని బాధిత దంపతుల వేడుకోలు● లద్నాపూర్‌లో మినరల్ వాటర్ ప్లాంట్ ప్రారంభించిన మంత్రి శ్రీధర్ బాబు● ప్రజలకు మేలు చేయడమే ప్రజా ప్రభుత్వ లక్ష్యం: మంత్రి శ్రీధర్ బాబు● మార్కెట్ కమిటీ చైర్మన్ వైనాల రాజు కుటుంబాన్ని పరామర్శించిన మంత్రి శ్రీధర్ బాబు● భారీ వర్షంలోనూ వైభవంగా విజయనగరం పైడితల్లమ్మ సిరిమానోత్సవం● రోడ్డు ప్రమాదంలో మార్షల్ ఆర్ట్స్ విద్యార్థులకు తీవ్ర గాయాలు● మాజీ సర్పంచ్ రాకేష్ తండ్రి మృతి పట్ల సంతాపం తెలిపిన డాక్టర్ దూదిపాల వేణుధర్ రెడ్డి
Home › బ్రేకింగ్ న్యూస్ › భగత్‌సింగ్‌ ఆశయాలను ముందుకు తీసుకెళ్లాలి: ఎస్‌ఎఫ్‌ఐ విద్యార్థుల్లో శాస్త్రీయ దృక్పథం, ప్రశ్నించే తత్వం పెంపొందించాలి
బ్రేకింగ్ న్యూస్

భగత్‌సింగ్‌ ఆశయాలను ముందుకు తీసుకెళ్లాలి: ఎస్‌ఎఫ్‌ఐ విద్యార్థుల్లో శాస్త్రీయ దృక్పథం, ప్రశ్నించే తత్వం పెంపొందించాలి

దేవరకొండ, సెప్టెంబర్ 28: షాహిద్‌ భగత్‌సింగ్‌ చూపిన పోరాట స్ఫూర్తిని నేటి విద్యార్థులు, యువత ఆదర్శంగా తీసుకుని ఆయన ఆశయాలను ముందుకు తీసుకెళ్లాలని ఎస్‌ఎఫ్‌ఐ దేవరకొండ డివిజన్‌ కార్యదర్శి బుడిగ వెంకటేష్‌ పిలుపునిచ్చారు. ఎస్‌ఎఫ్‌ఐ దేవరకొండ డివిజన్‌ కమిటీ ఆధ్వర్యంలో షాహిద్‌ భగత్‌సింగ్‌ జయంతి వేడుకలను నిర్వహించారు. ఈ

01:47 మధ్యాహ్నం PM

దేవరకొండ, సెప్టెంబర్ 28:
షాహిద్‌ భగత్‌సింగ్‌ చూపిన పోరాట స్ఫూర్తిని నేటి విద్యార్థులు, యువత ఆదర్శంగా తీసుకుని ఆయన ఆశయాలను ముందుకు తీసుకెళ్లాలని ఎస్‌ఎఫ్‌ఐ దేవరకొండ డివిజన్‌ కార్యదర్శి బుడిగ వెంకటేష్‌ పిలుపునిచ్చారు.
ఎస్‌ఎఫ్‌ఐ దేవరకొండ డివిజన్‌ కమిటీ ఆధ్వర్యంలో షాహిద్‌ భగత్‌సింగ్‌ జయంతి వేడుకలను నిర్వహించారు. ఈ సందర్భంగా భగత్‌సింగ్‌ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు.
అనంతరం బుడిగ వెంకటేష్‌ మాట్లాడుతూ.. దేశ స్వాతంత్ర్యం కోసం భగత్‌సింగ్‌ చేసిన త్యాగాలు, ఆయన పోరాట స్ఫూర్తి నేటి తరానికి స్ఫూర్తిదాయకమన్నారు. భగత్‌సింగ్‌ కేవలం స్వాతంత్ర్య సమరయోధుడిగానే కాకుండా సమాజంలో సమానత్వం, సామాజిక న్యాయం, దోపిడీ నిర్మూలన వంటి అంశాలపై తన ఆలోచనలు, పోరాటాన్ని కొనసాగించారని పేర్కొన్నారు.
విద్యార్థుల్లో శాస్త్రీయ దృక్పథాన్ని, ప్రశ్నించే తత్వాన్ని పెంపొందించాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు. భగత్‌సింగ్‌ ఆశయాలను యువతలోకి తీసుకెళ్లేందుకు విద్యార్థి ఉద్యమాలు మరింత చైతన్యవంతంగా పనిచేయాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు నేతాల జయరాం, ఏన్నుపోతుల పరమేష్‌, నాగరాజు, శివ, అశోక్‌, అభిషేక్‌, భారత్‌, అజయ్‌, సంపత్‌, శ్రీకాంత్‌, ప్రేమ్‌, సాయిరాం, ఆంజనేయులు, చలపతి, అశ్వంత్‌, భాను, శివయ్య తదితరులు పాల్గొన్నారు.
Ayush 24 News – The Voice of Truth

📲 వార్తను షేర్ చేయండి
🟢 WhatsApp🔵 Facebook
👁 Views: 7🔗 Shares: 0👍 Likes: 0
🇮🇳 జాతీయ స్థాయి రిపోర్టర్ నియామకంమీ ప్రాంతం నుంచి AYUSH24 NEWS కోసం వార్తలను అందించండి.
AYUSH24 NEWS Reporter
259 published stories

AYUSH24 NEWS Reporter Network

మీ ప్రాంతం నుంచి వార్తలు అందించాలనుకుంటున్నారా? మా Reporter Networkలో చేరండి.

Become a Reporter →

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

📱 Download App