Wednesday, 28 Oct 2026
28 Oct 2026Wednesday
⌕
Home   Reporter Profile
🔴 BREAKING
● రాజాపూర్‌లో పిచ్చికుక్క బీభత్సం.. ఐదుగురికి గాయాలు● రూ.85 లక్షల ఇంటిపై వివాదం.. న్యాయం చేయాలని బాధిత దంపతుల వేడుకోలు● లద్నాపూర్‌లో మినరల్ వాటర్ ప్లాంట్ ప్రారంభించిన మంత్రి శ్రీధర్ బాబు● ప్రజలకు మేలు చేయడమే ప్రజా ప్రభుత్వ లక్ష్యం: మంత్రి శ్రీధర్ బాబు● మార్కెట్ కమిటీ చైర్మన్ వైనాల రాజు కుటుంబాన్ని పరామర్శించిన మంత్రి శ్రీధర్ బాబు● భారీ వర్షంలోనూ వైభవంగా విజయనగరం పైడితల్లమ్మ సిరిమానోత్సవం● రోడ్డు ప్రమాదంలో మార్షల్ ఆర్ట్స్ విద్యార్థులకు తీవ్ర గాయాలు● మాజీ సర్పంచ్ రాకేష్ తండ్రి మృతి పట్ల సంతాపం తెలిపిన డాక్టర్ దూదిపాల వేణుధర్ రెడ్డి● రాజాపూర్‌లో పిచ్చికుక్క బీభత్సం.. ఐదుగురికి గాయాలు● రూ.85 లక్షల ఇంటిపై వివాదం.. న్యాయం చేయాలని బాధిత దంపతుల వేడుకోలు● లద్నాపూర్‌లో మినరల్ వాటర్ ప్లాంట్ ప్రారంభించిన మంత్రి శ్రీధర్ బాబు● ప్రజలకు మేలు చేయడమే ప్రజా ప్రభుత్వ లక్ష్యం: మంత్రి శ్రీధర్ బాబు● మార్కెట్ కమిటీ చైర్మన్ వైనాల రాజు కుటుంబాన్ని పరామర్శించిన మంత్రి శ్రీధర్ బాబు● భారీ వర్షంలోనూ వైభవంగా విజయనగరం పైడితల్లమ్మ సిరిమానోత్సవం● రోడ్డు ప్రమాదంలో మార్షల్ ఆర్ట్స్ విద్యార్థులకు తీవ్ర గాయాలు● మాజీ సర్పంచ్ రాకేష్ తండ్రి మృతి పట్ల సంతాపం తెలిపిన డాక్టర్ దూదిపాల వేణుధర్ రెడ్డి
Home › బ్రేకింగ్ న్యూస్ › భద్రాద్రి క్లస్టర్ స్థాయి క్రీడా ఎంపికలు ప్రారంభం
బ్రేకింగ్ న్యూస్

భద్రాద్రి క్లస్టర్ స్థాయి క్రీడా ఎంపికలు ప్రారంభం

04:00 తెల్లవారుజాము AM

విద్యార్థుల్లో దాగి ఉన్న క్రీడా ప్రతిభను వెలికితీయడమే లక్ష్యం

చదువుతో పాటు క్రీడల్లోనూ రాణించాలి: ఎమ్మెల్యే కోరం కనకయ్య

టేకులపల్లి, సెప్టెంబర్ 24 (ప్రతినిధి):
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టేకులపల్లి మండలం బద్దు తండాలోని ఎకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్‌లో భద్రాద్రి క్లస్టర్ స్పోర్ట్స్ సెలక్షన్స్–2026-27 క్రీడా ఎంపికలు ఘనంగా ప్రారంభమయ్యాయి.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఇల్లందు ఎమ్మెల్యే కోరం కనకయ్య హాజరయ్యారు. ఈ సందర్భంగా విద్యార్థులు, పాఠశాల సిబ్బంది ఎమ్మెల్యేకు ఘన స్వాగతం పలికి పుష్పగుచ్ఛం అందజేశారు.

అనంతరం విద్యార్థులను ఉద్దేశించి ఎమ్మెల్యే కోరం కనకయ్య మాట్లాడుతూ క్రీడలు విద్యార్థుల్లో క్రమశిక్షణ, ఆత్మవిశ్వాసం, పట్టుదలతో పాటు నాయకత్వ లక్షణాలను పెంపొందిస్తాయని పేర్కొన్నారు. చదువుతో పాటు క్రీడల్లోనూ ప్రతిభ కనబరిచి ఉన్నత స్థాయికి ఎదగాలని విద్యార్థులకు సూచించారు.

మూడు రోజుల పాటు నిర్వహించనున్న ఈ క్రీడా ఎంపికల్లో భద్రాద్రి క్లస్టర్ పరిధిలోని విద్యార్థులు వివిధ క్రీడా విభాగాల్లో పాల్గొని తమ ప్రతిభను ప్రదర్శించనున్నారు. గ్రామీణ, గిరిజన ప్రాంతాల్లోని విద్యార్థుల్లో దాగి ఉన్న క్రీడా నైపుణ్యాన్ని వెలికితీసి, వారిని జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయి పోటీలకు తీర్చిదిద్దే లక్ష్యంతో ఈ ఎంపికలు నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు.

క్రీడల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచి భద్రాద్రి క్లస్టర్‌తో పాటు తమ పాఠశాలకు మంచి పేరు తీసుకురావాలని ఎమ్మెల్యే కోరం కనకయ్య విద్యార్థులకు శుభాకాంక్షలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో టేకులపల్లి ఎస్సై తిరుపతి, ఇల్లందు నియోజకవర్గ కాంగ్రెస్ నాయకుడు కోరం సురేందర్, మండల కాంగ్రెస్ నాయకులు ఈది గణేష్, పోశాలు, సర్దార్, కోయగూడెం సర్పంచ్ కోరం సుభాష్ చంద్రబోస్ తదితరులు పాల్గొన్నారు.

📲 వార్తను షేర్ చేయండి
🟢 WhatsApp🔵 Facebook
👁 Views: 8🔗 Shares: 0👍 Likes: 0
🇮🇳 జాతీయ స్థాయి రిపోర్టర్ నియామకంమీ ప్రాంతం నుంచి AYUSH24 NEWS కోసం వార్తలను అందించండి.
AYUSH24 NEWS Reporter
37 published stories

AYUSH24 NEWS Reporter Network

మీ ప్రాంతం నుంచి వార్తలు అందించాలనుకుంటున్నారా? మా Reporter Networkలో చేరండి.

Become a Reporter →

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

📱 Download App