సామూహిక కుంకుమ పూజల్లో పెద్ద సంఖ్యలో పాల్గొన్న మహిళలు
దేవరకొండ, సెప్టెంబర్ 24 (ప్రతినిధి):
దేవరకొండ పట్టణంలోని రంగ్రీజ్ బజార్లో భావో సార క్షత్రియ సేవా కమిటీ ఆధ్వర్యంలో 50వ వసంతంలోకి అడుగుపెట్టిన గణపతి నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి.
గణేష్ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా మంగళవారం మహిళలచే ప్రత్యేక సామూహిక కుంకుమ పూజ కార్యక్రమాన్ని భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారిని, విఘ్నేశ్వరుడిని పూజించారు. అనంతరం వినాయకుడిని దర్శించుకుని ప్రజలందరూ ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలు, శాంతి సౌభాగ్యాలతో ఉండాలని ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తుల పూజలు, మంత్రోచ్ఛారణలతో మండప ప్రాంగణం ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది.

అనంతరం నిర్వహించిన మహా అన్నప్రసాద కార్యక్రమంలో 16వ వార్డు కౌన్సిలర్ రూప్ల నాయక్, నీలా రవికుమార్ పాల్గొని భక్తులకు మహా అన్నప్రసాదాన్ని అందజేశారు. ఈ సందర్భంగా కుటుంబ సమేతంగా విచ్చేసిన కౌన్సిలర్ రూప్ల నాయక్‌ను కమిటీ సభ్యులు శాలువాతో సన్మానించారు.
ఈ కార్యక్రమంలో గణేష్ మండప నిర్వాహకులు సూత్రవే సురేష్ రావు, సర్యరే ప్రవీణ్, లెండాల దీపక్, నౌలే దీపక్‌తో పాటు కమిటీ సభ్యులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.










Leave a Reply