ఎమ్మెల్సీ శ్రీమతి సురభి వాణీదేవి చేతుల మీదుగా అవార్డుల ప్రదానం
హైదరాబాద్, అక్టోబర్ 06, 2026, AYUSH24 NEWS ప్రతినిధి:
హైదరాబాద్‌లోని నాంపల్లి పబ్లిక్ గార్డెన్ పరిధిలో ఉన్న తెలుగు విశ్వవిద్యాలయం కేంద్రంలో నిర్వహించిన కార్యక్రమంలో మహాత్మా గాంధీ లీడర్షిప్ అవార్డులను ప్రదానం చేశారు.
మాజీ ప్రధాని పీవీ నరసింహారావు కుమార్తె, ఎమ్మెల్సీ శ్రీమతి సురభి వాణీదేవి చేతుల మీదుగా GVS గిరిజన విద్యార్థి సంఘం తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యక్షుడు దీరావత్ కోటియా నాయక్ మహాత్మా గాంధీ లీడర్షిప్ అవార్డును అందుకున్నారు.
అదేవిధంగా సూర్యాపేట జిల్లా పాలకవీడు మండలానికి చెందిన ఉద్యమకారుడు, సామాజిక సేవకుడు రమావత్ నరి నాయక్ కూడా మహాత్మా గాంధీ లీడర్షిప్ అవార్డును అందుకున్నారు.
ఈ సందర్భంగా అవార్డులు అందుకున్న దీరావత్ కోటియా నాయక్, రమావత్ నరి నాయక్‌లకు పలువురు అభినందనలు తెలిపారు.










Leave a Reply