కొండమల్లేపల్లి: మండలానికి చెందిన మాజీ ఎంపీటీసీ కైలాసం గారి మృతి పట్ల కొండమల్లేపల్లి PACS చైర్మన్, TPCC సభ్యులు డాక్టర్ దూదిపాల వేణుధర్ రెడ్డి గారు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కైలాసం గారి పార్థివదేహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.
ఈ సందర్భంగా డాక్టర్ దూదిపాల వేణుధర్ రెడ్డి గారు మాట్లాడుతూ, మాజీ ఎంపీటీసీ కైలాసం గారి మృతి కాంగ్రెస్ పార్టీకి తీరని లోటని పేర్కొన్నారు. ప్రజా జీవితంలో ఆయన చేసిన సేవలను స్మరించుకుంటూ, ఆయన మరణం పట్ల ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు. అనంతరం కైలాసం గారి కుటుంబ సభ్యులను పరామర్శించి, తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.
ఈ విషాద సమయంలో భగవంతుడు వారి కుటుంబ సభ్యులకు మనోధైర్యాన్ని ప్రసాదించాలని, కైలాసం గారి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు.
ఈ కార్యక్రమంలో బూడిగా శంకర్, నాయిని శుభాష్ రెడ్డి, నాయిని రమేష్ రెడ్డి తదితరులు పాల్గొని కైలాసం గారికి నివాళులర్పించారు.
Ayush 24 News
మాజీ ఎంపీటీసీ కైలాసం మృతి కాంగ్రెస్ పార్టీకి తీరని లోటు: డాక్టర్ దూదిపాల వేణుధర్ రెడ్డి
కొండమల్లేపల్లి: మండలానికి చెందిన మాజీ ఎంపీటీసీ కైలాసం గారి మృతి పట్ల కొండమల్లేపల్లి PACS చైర్మన్, TPCC సభ్యులు డాక్టర్ దూదిపాల వేణుధర్ రెడ్డి గారు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కైలాసం గారి పార్థివదేహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా డాక్టర్ దూదిపాల వేణుధర్


AYUSH24 NEWS Reporter Network
మీ ప్రాంతం నుంచి వార్తలు అందించాలనుకుంటున్నారా? మా Reporter Networkలో చేరండి.
Become a Reporter →








Leave a Reply