వైనాల సాంబయ్య చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు
అవయవదానానికి గుర్తింపుగా కుటుంబ సభ్యులకు ప్రశంసాపత్రం అందజేత
కమాన్పూర్, అక్టోబర్ 28, 2026, AYUSH24 NEWS ప్రతినిధి:
పెద్దపల్లి జిల్లా కమాన్పూర్ మార్కెట్ కమిటీ చైర్మన్ వైనాల రాజు తండ్రి వైనాల సాంబయ్య ఇటీవల మృతి చెందడంతో రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించారు.
ఈ సందర్భంగా వైనాల సాంబయ్య చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం మార్కెట్ కమిటీ చైర్మన్ వైనాల రాజుతో పాటు కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు.

అవయవదానానికి గుర్తింపుగా ప్రశంసాపత్రం
వైనాల సాంబయ్య అవయవదానం చేసిన నేపథ్యంలో సదాశివ ఫౌండేషన్ సభ్యులు ఆయన కుటుంబ సభ్యులకు ప్రశంసాపత్రాన్ని అందజేశారు.
మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు చేతుల మీదుగా కుటుంబ సభ్యులకు ఈ ప్రశంసాపత్రాన్ని అందజేశారు. సాంబయ్య అవయవదానాన్ని గుర్తిస్తూ సదాశివ ఫౌండేషన్ ఈ కార్యక్రమాన్ని నిర్వహించింది.










Leave a Reply