టేకులపల్లి, సెప్టెంబర్ 21 (ప్రతినిధి): టేకులపల్లి మండలం మూడ్ తండా గ్రామంలో మూడ్ మాలతీ–గోపి దంపతుల నూతన ఇందిరమ్మ ఇంటి స్లాబ్ నిర్మాణ పనులను ఇల్లందు నియోజకవర్గ ఎమ్మెల్యే కోరం కనకయ్య ప్రారంభించారు. కొబ్బరికాయ కొట్టి నిర్మాణ పనులకు శ్రీకారం చుట్టారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే కోరం కనకయ్య మాట్లాడుతూ.. పేద, మధ్యతరగతి కుటుంబాల సొంతింటి కలను సాకారం చేయాలనే లక్ష్యంతో ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని అమలు చేస్తోందన్నారు. అర్హత కలిగిన ప్రతి కుటుంబానికి ప్రభుత్వ సంక్షేమ పథకాల ద్వారా అండగా నిలుస్తున్నామని తెలిపారు.
ఇంటి నిర్మాణ పనులు ప్రారంభమైన సందర్భంగా మాలతీ–గోపి దంపతులు ఎమ్మెల్యే కోరం కనకయ్యకు కృతజ్ఞతలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకులు కోరం సురేందర్, స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.










Leave a Reply