చంద్రుతండా, సెప్టెంబర్ 17, అయుష్ 24 న్యూస్ ప్రతినిధి : చంద్రుతండా గ్రామ పంచాయతీకి చెందిన బిక్కులాల్ కుమారుడు ఇటీవల మృతి చెందారు. విషయం తెలుసుకున్న ఇల్లందు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకుడు కోరం సురేందర్ గురువారం వారి నివాసానికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించారు.
ఈ సందర్భంగా మృతుడి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేసిన కోరం సురేందర్, కుటుంబానికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. కుటుంబానికి రూ.5,000 ఆర్థిక సహాయాన్ని అందించారు.
కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పిన ఆయన, భవిష్యత్తులో అవసరమైన సహాయం అందించేందుకు తమ వంతు సహకారం ఉంటుందని తెలిపారు.

ఈ కార్యక్రమంలో చంద్రుతండా కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.
— అయుష్ 24 న్యూస్ ప్రతినిధి










Leave a Reply