నేటి నుంచి అమల్లోకి రానున్న ‘కామన్ పాస్’ విధానం
హైదరాబాద్, అక్టోబర్ 02, 2026, AYUSH24 NEWS ప్రతినిధి:
గ్రేటర్ హైదరాబాద్ మహానగర పరిధిలోని ప్రయాణికులకు టీజీఆర్టీసీ, హైదరాబాద్ మెట్రో రైల్ సంయుక్తంగా శుభవార్త అందించాయి. నగరంలో బస్సులు, మెట్రో రైళ్లలో ప్రయాణించే వారికి వేర్వేరు పాస్‌లకు బదులుగా ఒకే ‘కామన్ పాస్’ను అందుబాటులోకి తీసుకురానున్నారు.
రోజూ లక్షలాది మంది ఉద్యోగ, ఉపాధి అవసరాల కోసం ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి బస్సులు, మెట్రో రైళ్లలో ప్రయాణిస్తున్నారు. ఆర్టీసీ బస్సుల్లో రోజుకు సుమారు 25 లక్షల మంది, మెట్రో రైల్ మూడు కారిడార్లలో రోజుకు సుమారు నాలుగున్నర లక్షల మంది ప్రయాణిస్తున్నట్లు పేర్కొన్నారు.
ప్రస్తుతం బస్సులు, మెట్రో రైళ్లలో ప్రయాణించేందుకు వేర్వేరు టికెట్లు లేదా పాస్‌లు తీసుకోవాల్సి వస్తోంది. దీంతో ప్రయాణికులకు ఆర్థిక భారంతో పాటు సమయం కూడా వృథా అవుతున్న నేపథ్యంలో బస్సులు, మెట్రో రైళ్లకు కలిపి ఒకే పాస్‌ను అందుబాటులోకి తీసుకురావాలని నిర్ణయించారు.
ఈ ‘కామన్ పాస్’ విధానం నేటి నుంచి అందుబాటులోకి రానుంది. ప్రజాభవన్‌లో జరిగే కార్యక్రమంలో ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు శ్రీధర్ బాబు, వివేక్ వెంకటస్వామి, పొన్నం ప్రభాకర్ ఈ విధానాన్ని శుక్రవారం లాంఛనంగా ప్రారంభించనున్నారు.










Leave a Reply