Wednesday, 28 Oct 2026
28 Oct 2026Wednesday
⌕
Home   Reporter Profile
🔴 BREAKING
● రాజాపూర్‌లో పిచ్చికుక్క బీభత్సం.. ఐదుగురికి గాయాలు● రూ.85 లక్షల ఇంటిపై వివాదం.. న్యాయం చేయాలని బాధిత దంపతుల వేడుకోలు● లద్నాపూర్‌లో మినరల్ వాటర్ ప్లాంట్ ప్రారంభించిన మంత్రి శ్రీధర్ బాబు● ప్రజలకు మేలు చేయడమే ప్రజా ప్రభుత్వ లక్ష్యం: మంత్రి శ్రీధర్ బాబు● మార్కెట్ కమిటీ చైర్మన్ వైనాల రాజు కుటుంబాన్ని పరామర్శించిన మంత్రి శ్రీధర్ బాబు● భారీ వర్షంలోనూ వైభవంగా విజయనగరం పైడితల్లమ్మ సిరిమానోత్సవం● రోడ్డు ప్రమాదంలో మార్షల్ ఆర్ట్స్ విద్యార్థులకు తీవ్ర గాయాలు● మాజీ సర్పంచ్ రాకేష్ తండ్రి మృతి పట్ల సంతాపం తెలిపిన డాక్టర్ దూదిపాల వేణుధర్ రెడ్డి● రాజాపూర్‌లో పిచ్చికుక్క బీభత్సం.. ఐదుగురికి గాయాలు● రూ.85 లక్షల ఇంటిపై వివాదం.. న్యాయం చేయాలని బాధిత దంపతుల వేడుకోలు● లద్నాపూర్‌లో మినరల్ వాటర్ ప్లాంట్ ప్రారంభించిన మంత్రి శ్రీధర్ బాబు● ప్రజలకు మేలు చేయడమే ప్రజా ప్రభుత్వ లక్ష్యం: మంత్రి శ్రీధర్ బాబు● మార్కెట్ కమిటీ చైర్మన్ వైనాల రాజు కుటుంబాన్ని పరామర్శించిన మంత్రి శ్రీధర్ బాబు● భారీ వర్షంలోనూ వైభవంగా విజయనగరం పైడితల్లమ్మ సిరిమానోత్సవం● రోడ్డు ప్రమాదంలో మార్షల్ ఆర్ట్స్ విద్యార్థులకు తీవ్ర గాయాలు● మాజీ సర్పంచ్ రాకేష్ తండ్రి మృతి పట్ల సంతాపం తెలిపిన డాక్టర్ దూదిపాల వేణుధర్ రెడ్డి
Home › బ్రేకింగ్ న్యూస్ › మౌలిక సదుపాయాల కల్పనకు ప్రణాళికలు సిద్ధం
బ్రేకింగ్ న్యూస్

మౌలిక సదుపాయాల కల్పనకు ప్రణాళికలు సిద్ధం

09:35 ఉదయం AM

గ్రామాభివృద్ధికి అవసరమైన పనులకు ప్రాధాన్యం: సర్పంచ్ దండవేన సంధ్య బానేష్

మంథని, అక్టోబర్ 02, 2026, AYUSH24 NEWS ప్రతినిధి:

మంథని మండలం గుంజపడుగు గ్రామంలో మహాత్మా గాంధీ జయంతిని ఘనంగా నిర్వహించారు. గ్రామ సర్పంచ్ దండవేన సంధ్య బానేష్ ఆధ్వర్యంలో వీబీ-జీ రామ్ జీ (VB-G RAM G) పథకంపై గ్రామసభ నిర్వహించారు.

ఈ సందర్భంగా సర్పంచ్ దండవేన సంధ్య బానేష్ మాట్లాడుతూ గ్రామంలో మౌలిక వసతుల కల్పనలో భాగంగా గుంజపడుగుకు అవసరమైన అభివృద్ధి పనులపై ప్రణాళికలు రూపొందించినట్లు తెలిపారు. వీబీ-జీ రామ్ జీ ద్వారా 375 రకాల పనులు చేపట్టవచ్చని పేర్కొన్నారు. గ్రామానికి అవసరమైన రోడ్లు, కుంటలు, రైతులకు సంబంధించిన తోటలు, చెరువుల మరమ్మతులు, ఇంకుడు గుంతలు, డ్రైనేజీలు, సోక్ పిట్లు, పొలం కుంటలు, రైతులు పొలాలకు వెళ్లేందుకు దారులు తదితర పనులు చేపట్టవచ్చని వివరించారు.

ప్రకృతి వైపరీత్యాలను తట్టుకునే విధంగా గ్రామంలో ముందస్తు ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు తెలిపారు. ఈ ఏడాది ఎల్‌నినో ప్రభావంతో వర్షాలు తక్కువగా కురిసిన నేపథ్యంలో భూగర్భ జలాలను సంరక్షించేందుకు ప్రతి ఒక్కరూ ఇంకుడు గుంతలు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. నీటిని వృథా చేయకుండా జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. పాఠశాల కాంపౌండ్ వాల్స్, పంచాయతీ భవనాల నిర్మాణం వంటి పనులను కూడా చేపట్టవచ్చని తెలిపారు.

కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మంథని ఎస్ఐ సందీప్ కుమార్ సైబర్ నేరాల పట్ల ప్రజలు తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు. గ్రామంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. యువత మత్తు పదార్థాలకు బానిస కాకుండా అప్రమత్తంగా ఉండాలని కోరారు.

ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ ఎన్నికల లక్ష్మి, వార్డు సభ్యులు దొడ్డిపట్ల శంకర్, సాదుల సుజాత, సాదుల కళ్యాణి, దేవరకొండ పోచం, భోగె సంపత్, శనిగారపు సుమలత, దేవల్ల లక్ష్మి, బండి ఓదెలు, ఏఎన్ఎం పద్మ, వైష్ణవి, వర్కర్లు రమాదేవి, స్వప్న, సీఏలు రాధ, భూలక్ష్మి, వ్యవసాయ శాఖ ఏఈఓ, కార్యదర్శి సతీష్ కుమార్‌తో పాటు గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

📲 వార్తను షేర్ చేయండి
🟢 WhatsApp🔵 Facebook
👁 Views: 14🔗 Shares: 0👍 Likes: 0
🇮🇳 జాతీయ స్థాయి రిపోర్టర్ నియామకంమీ ప్రాంతం నుంచి AYUSH24 NEWS కోసం వార్తలను అందించండి.
AYUSH24 NEWS Reporter
366 published stories

AYUSH24 NEWS Reporter Network

మీ ప్రాంతం నుంచి వార్తలు అందించాలనుకుంటున్నారా? మా Reporter Networkలో చేరండి.

Become a Reporter →

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

📱 Download App