యువజన కాంగ్రెస్ ఆవిర్భావ దినోత్సవం ఘనంగా నిర్వహణ
దేవరకొండ: యువజన కాంగ్రెస్ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా దేవరకొండ నియోజకవర్గ యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు కిన్నెర హరికృష్ణ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో వేడుకలు నిర్వహించారు.ఈ సందర్భంగా యువజన కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలతో కలిసి కేక్ కట్ చేసి ఆవిర్భావ దినోత్సవ వేడుకలను జరుపుకున్నారు.అనంతరం దేవరకొండ పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రిని సందర్శించి, ప్రసూతి పొందిన బాలింతలను పరామర్శించారు. వారికి బ్రెడ్ ప్యాకెట్లు, పండ్లు పంపిణీ చేశారు.ఈ కార్యక్రమంలో యువజన కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొని సేవా కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.— Ayush24 News#Ayush24News #YouthCongress #YouthCongressFoundationDay #Devarakonda #Congress #KinneraHarikrishna

