టైలరింగ్, కంప్యూటర్, బ్యూటీషియన్ కోర్సుల మూడో బ్యాచ్లకు శ్రీకారం
దేవరకొండ, అక్టోబర్ 02, 2026, AYUSH24 NEWS ప్రతినిధి:
గ్రామీణ యువత, మహిళలు స్వయం ఉపాధి దిశగా అడుగులు వేసేందుకు విలేజ్ డెవలప్ సొసైటీ (VDS) ఆధ్వర్యంలో దేవరకొండ పట్టణంలో ఉచిత వృత్తి విద్యా శిక్షణా కేంద్రాల మూడో విడత బ్యాచ్లను ప్రారంభించారు. గాంధీ జయంతిని పురస్కరించుకుని నిర్వహించిన కార్యక్రమంలో టైలరింగ్, కంప్యూటర్, బ్యూటీషియన్ కోర్సుల కొత్త బ్యాచ్లకు శ్రీకారం చుట్టారు.
కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రిటైర్డ్ హెల్త్ సీహెచ్ఓ ఆర్. గోపాల్ సింగ్, రిటైర్డ్ కండక్టర్ ధరం సింగ్, ఆర్టీఐ ఆక్టివిస్ట్ సొసైటీ రాష్ట్ర అధ్యక్షుడు డా. కొర్ర కిషన్ నాయక్ హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి శిక్షణా కేంద్రాలను ప్రారంభించారు.

ఈ సందర్భంగా అతిథులు మాట్లాడుతూ, నిరుద్యోగ యువత, మహిళలు చేతివృత్తులతో పాటు సాంకేతిక నైపుణ్యాలను నేర్చుకోవడం ద్వారా స్వయం ఉపాధి అవకాశాలను మెరుగుపరుచుకోవచ్చని పేర్కొన్నారు. దేవరకొండ ప్రాంతంలోని యువత, మహిళలకు ఉచితంగా వృత్తి నైపుణ్య శిక్షణ అందిస్తున్న VDS సేవలను అభినందించారు.
శిక్షణ పొందే వారు అందుబాటులో ఉన్న అవకాశాలను సద్వినియోగం చేసుకుని నైపుణ్యాలను పెంపొందించుకోవాలని సూచించారు.
కార్యక్రమంలో VDS కోఆర్డినేటర్ భాషా చౌహాన్, నాయకులు టీక్య నాయక్, గోవర్ధన్, ఎన్. శాంతి, కే. కవిత, బి. నిహారిక తదితరులు పాల్గొన్నారు.










Leave a Reply