Wednesday, 28 Oct 2026
28 Oct 2026Wednesday
⌕
Home   Reporter Profile
🔴 BREAKING
● భారీ వర్షంలోనూ వైభవంగా విజయనగరం పైడితల్లమ్మ సిరిమానోత్సవం● రోడ్డు ప్రమాదంలో మార్షల్ ఆర్ట్స్ విద్యార్థులకు తీవ్ర గాయాలు● మాజీ సర్పంచ్ రాకేష్ తండ్రి మృతి పట్ల సంతాపం తెలిపిన డాక్టర్ దూదిపాల వేణుధర్ రెడ్డి● నవంబర్ 6లోగా పట్టభద్రులు ఓటు నమోదు చేసుకోవాలి● బీసీల రాజ్యాధికారమే మా ధ్యేయం: తీన్మార్ మల్లన్న● దేవరకొండ నియోజకవర్గంలో రేపు ఎమ్మెల్యే బాలు నాయక్ పర్యటన● రోడ్డు ప్రమాదంలో గాయపడిన యువకుడిని పరామర్శించిన ఎమ్మెల్యే బాలు నాయక్● సిటీ సివిల్ కోర్టును సందర్శించిన MSS లా కళాశాల విద్యార్థులు● భారీ వర్షంలోనూ వైభవంగా విజయనగరం పైడితల్లమ్మ సిరిమానోత్సవం● రోడ్డు ప్రమాదంలో మార్షల్ ఆర్ట్స్ విద్యార్థులకు తీవ్ర గాయాలు● మాజీ సర్పంచ్ రాకేష్ తండ్రి మృతి పట్ల సంతాపం తెలిపిన డాక్టర్ దూదిపాల వేణుధర్ రెడ్డి● నవంబర్ 6లోగా పట్టభద్రులు ఓటు నమోదు చేసుకోవాలి● బీసీల రాజ్యాధికారమే మా ధ్యేయం: తీన్మార్ మల్లన్న● దేవరకొండ నియోజకవర్గంలో రేపు ఎమ్మెల్యే బాలు నాయక్ పర్యటన● రోడ్డు ప్రమాదంలో గాయపడిన యువకుడిని పరామర్శించిన ఎమ్మెల్యే బాలు నాయక్● సిటీ సివిల్ కోర్టును సందర్శించిన MSS లా కళాశాల విద్యార్థులు
Home › బ్రేకింగ్ న్యూస్ › రంగారెడ్డి జిల్లా డీసీసీ అధ్యక్షురాలిగా చిగిరింత పారిజాత నర్సింహారెడ్డి బాధ్యతల స్వీకరణ
బ్రేకింగ్ న్యూస్

రంగారెడ్డి జిల్లా డీసీసీ అధ్యక్షురాలిగా చిగిరింత పారిజాత నర్సింహారెడ్డి బాధ్యతల స్వీకరణ

హైదరాబాద్, అక్టోబర్ 16 (ఆయుష్ 24 న్యూస్): రంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ కమిటీ (డీసీసీ) నూతన అధ్యక్షురాలిగా నియమితులైన చిగిరింత పారిజాత నర్సింహారెడ్డి శుక్రవారం హైదరాబాద్‌లోని గాంధీభవన్‌లో తన పదవీ బాధ్యతలను ఘనంగా స్వీకరించారు. వేదమంత్రోచ్ఛారణలు, పార్టీ నాయకులు, కార్యకర్తల సందడి మధ్య ఈ కార్యక్రమం వైభవంగా జరిగింది.

04:43 సాయంత్రం PM

హైదరాబాద్, అక్టోబర్ 16 (ఆయుష్ 24 న్యూస్): రంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ కమిటీ (డీసీసీ) నూతన అధ్యక్షురాలిగా నియమితులైన చిగిరింత పారిజాత నర్సింహారెడ్డి శుక్రవారం హైదరాబాద్‌లోని గాంధీభవన్‌లో తన పదవీ బాధ్యతలను ఘనంగా స్వీకరించారు. వేదమంత్రోచ్ఛారణలు, పార్టీ నాయకులు, కార్యకర్తల సందడి మధ్య ఈ కార్యక్రమం వైభవంగా జరిగింది.
ఈ కార్యక్రమానికి రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ముఖ్య అతిథిగా హాజరై, నూతన డీసీసీ అధ్యక్షురాలు చిగిరింత పారిజాత నర్సింహారెడ్డి కి శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ.. రంగారెడ్డి జిల్లాలో కాంగ్రెస్ పార్టీని క్షేత్రస్థాయి నుంచి మరింత బలోపేతం చేయడంలో పారిజాత నర్సింహారెడ్డి నాయకత్వం కీలక పాత్ర పోషిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రజా సమస్యలపై నిరంతరం పోరాడుతూ, పార్టీని ప్రజలకు మరింత చేరువ చేయాలని సూచించారు.
ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయం
అనంతరం నూతన డీసీసీ అధ్యక్షురాలు చిగిరింత పారిజాత నర్సింహారెడ్డి మాట్లాడుతూ.. తనపై నమ్మకం ఉంచి కీలక బాధ్యతలు అప్పగించిన కాంగ్రెస్ పార్టీ జాతీయ, రాష్ట్ర నాయకత్వానికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. తనకు అప్పగించిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తూ, రంగారెడ్డి జిల్లాలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని స్పష్టం చేశారు. పార్టీ నాయకులు, కార్యకర్తలను సమన్వయం చేసుకుంటూ కాంగ్రెస్ పార్టీ అభివృద్ధికి అంకితభావంతో పనిచేస్తానని పేర్కొన్నారు.
పార్టీ నాయకుల ఘన సత్కారం
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు వి. హనుమంతరావు, చల్లా నర్సింహారెడ్డి, పట్నం సునీత మహేందర్ రెడ్డి, తెలంగాణ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు జక్కిడి శివ చరణ్ రెడ్డి, సరితా తిరుపతయ్య, చరణ్ కౌశిక్ యాదవ్, రఘునాథ్ యాదవ్, కాల్వ సుజాత, సామ రామ్మోహన్ రెడ్డితో పాటు పలువురు ప్రజాప్రతినిధులు, వివిధ మండలాల పార్టీ అధ్యక్షులు, అనుబంధ సంఘాల నాయకులు, కాంగ్రెస్ కార్యకర్తలు పాల్గొన్నారు.
నూతన డీసీసీ అధ్యక్షురాలు చిగిరింత పారిజాత నర్సింహారెడ్డిని నాయకులు, కార్యకర్తలు పూలమాలలు, శాలువాలతో ఘనంగా సత్కరించి అభినందనలు తెలిపారు.
— ఆయుష్ 24 న్యూస్

📲 వార్తను షేర్ చేయండి
🟢 WhatsApp🔵 Facebook
👁 Views: 9🔗 Shares: 0👍 Likes: 0
🇮🇳 జాతీయ స్థాయి రిపోర్టర్ నియామకంమీ ప్రాంతం నుంచి AYUSH24 NEWS కోసం వార్తలను అందించండి.
AYUSH24 NEWS Reporter
259 published stories

AYUSH24 NEWS Reporter Network

మీ ప్రాంతం నుంచి వార్తలు అందించాలనుకుంటున్నారా? మా Reporter Networkలో చేరండి.

Become a Reporter →

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

📱 Download App