నూతన బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా అభినందించిన కాంగ్రెస్ పార్టీ DSB సోషల్ మీడియా టీం
మంథని, అక్టోబర్ 07, 2026, AYUSH24 NEWS ప్రతినిధి:
రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, శాసనసభ వ్యవహారాల మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి దుద్దిల్ల శ్రీను బాబు ఆశీస్సులతో రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా కార్యదర్శిగా నూతన బాధ్యతలు స్వీకరించిన ఆరెల్లి కిరణ్ గౌడ్‌ను కాంగ్రెస్ పార్టీ DSB సోషల్ మీడియా టీం సభ్యులు ఘనంగా సత్కరించారు.
ఈ సందర్భంగా ఆరెల్లి కిరణ్ గౌడ్‌కు శాలువా కప్పి సత్కరించి, మిఠాయిలు పంచి శుభాకాంక్షలు తెలిపారు.
సోషల్ మీడియా టీం సభ్యులు మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీలో కష్టపడి పనిచేసే ప్రతి కార్యకర్తకు సముచిత గుర్తింపు, బాధ్యతలు లభిస్తాయని పేర్కొన్నారు. ఆరెల్లి కిరణ్ గౌడ్‌కు రాష్ట్ర సోషల్ మీడియా కార్యదర్శిగా బాధ్యతలు అప్పగించడం అందుకు నిదర్శనమని అన్నారు.
ఈ సందర్భంగా ఆరెల్లి కిరణ్ గౌడ్ మాట్లాడుతూ తనను అభినందించిన సోషల్ మీడియా టీం సభ్యులకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. తనపై చూపిస్తున్న ప్రేమాభిమానాలు, ఆశీస్సులు ఎల్లప్పుడూ ఇలాగే ఉండాలని కోరారు.
ఆరెల్లి కిరణ్ గౌడ్ రాష్ట్ర సోషల్ మీడియా కార్యదర్శిగా నూతన బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా స్థానిక నాయకులు, కార్యకర్తలు హర్షం వ్యక్తం చేస్తూ అభినందనలు తెలిపారు.
కార్యక్రమంలో సోషల్ మీడియా సభ్యులు పంచిక దేవేందర్, రేపాక శ్రీకాంత్, అరుణ్, బూడిద రమేష్ తదితరులు పాల్గొన్నారు.










Leave a Reply