దేవరకొండ: ఢిల్లీలో నిర్వహించిన “సేవ్ డెమోక్రసీ – ఓట్ బచావో – దేశ్ బచావో” కార్యక్రమంలో పాల్గొని ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం శాంతియుతంగా నిరసన తెలిపిన లోక్సభ ప్రతిపక్ష నేత శ్రీ రాహుల్ గాంధీ గారి అరెస్టును యువనేత నేనావత్ దేవరన్ నాయక్ గారు తీవ్రంగా ఖండించారు.
ప్రజల తరఫున ప్రశ్నించే ప్రతిపక్ష గొంతును అణచివేయడం ప్రజాస్వామ్య వ్యవస్థకు ఏమాత్రం మంచిది కాదని ఆయన అన్నారు. దేశంలోని ప్రతి పౌరుడికి ఉన్న ఓటు హక్కు అత్యంత విలువైన ప్రజాస్వామ్య హక్కు అని, ఆ హక్కుపై ఎలాంటి అనుమానాలకు తావులేకుండా ఎన్నికల వ్యవస్థ పారదర్శకంగా, నిష్పక్షపాతంగా కొనసాగాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.
ప్రజాస్వామ్య సంస్థల స్వతంత్రత, రాజ్యాంగ హక్కులు, ప్రజల ఓటు హక్కును కాపాడేందుకు కాంగ్రెస్ పార్టీ ప్రజల గొంతుకగా ముందుండి పోరాటం కొనసాగిస్తుందని నేనావత్ దేవరన్ నాయక్ గారు స్పష్టం చేశారు.
“ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం పోరాటం కొనసాగుతుంది. ప్రజల ఓటు హక్కుకు కాంగ్రెస్ పార్టీ అండగా నిలుస్తుంది” అని ఆయన పేర్కొన్నారు.
— Ayush 24 News
The Voice of Truth
రాహుల్ గాంధీ అరెస్టును తీవ్రంగా ఖండించిన యువనేత నేనావత్ దేవరన్ నాయక్
దేవరకొండ: ఢిల్లీలో నిర్వహించిన “సేవ్ డెమోక్రసీ – ఓట్ బచావో – దేశ్ బచావో” కార్యక్రమంలో పాల్గొని ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం శాంతియుతంగా నిరసన తెలిపిన లోక్సభ ప్రతిపక్ష నేత శ్రీ రాహుల్ గాంధీ గారి అరెస్టును యువనేత నేనావత్ దేవరన్ నాయక్ గారు తీవ్రంగా ఖండించారు. ప్రజల


AYUSH24 NEWS Reporter Network
మీ ప్రాంతం నుంచి వార్తలు అందించాలనుకుంటున్నారా? మా Reporter Networkలో చేరండి.
Become a Reporter →







Leave a Reply