* పొలాలకు 24 గంటల ఉచిత విద్యుత్ అందించాలి
విద్యుత్ సరఫరాలో నిర్లక్ష్యాన్ని విడనాడాల పార్టీ నాయకులు కేతావత్ బీల్యా నాయక్
తీవ్ర విద్యుత్ కోతలను తక్షణమే నివారించి, వ్యవసాయానికి నిరంతరాయంగా 24 గంటల నాణ్యమైన ఉచిత విద్యుత్ అందించాలని దేవరకొండ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ నాయకులు కేతావత్ బీల్యా నాయక్ డిమాండ్ చేశారు. విద్యుత్ కోతల కారణంగా ఎండిపోతున్న పంటలను కాపాడేందుకు ప్రభుత్వం వెంటనే చర్యలు చేపట్టాలని కోరారు
*వ్యవసాయానికి కీలకమైన సమయంలో విద్యుత్ సరఫరాలో అంతరాయాలు ఏర్పడటంతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని కేతావత్ బీల్యా నాయక్ ఆవేదన వ్యక్తం చేశారు. సకాలంలో విద్యుత్ అందక మోటార్లు పనిచేయక, పంటలకు అవసరమైన సాగునీరు అందక పంటలు దెబ్బతినే పరిస్థితి నెలకొందని పేర్కొన్నారు. రాత్రివేళల్లో సైతం విద్యుత్ కోసం రైతులు పొలాల వద్ద గంటల తరబడి వేచి చూడాల్సి రావడం రైతుల కష్టాలకు అద్దం పడుతోందన్నారు.
*బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కేసీఆర్ నాయకత్వంలో వ్యవసాయానికి 24 గంటల ఉచిత విద్యుత్ అందించామని గుర్తుచేశారు. ప్రస్తుతం రైతులు ఎదుర్కొంటున్న విద్యుత్ కోతలు వ్యవసాయ రంగంపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయని అన్నారు. రైతులకు నిరంతరాయ విద్యుత్ అందిస్తామని హామీ ఇచ్చిన ప్రభుత్వం, ఆ హామీని ఆచరణలో అమలు చేసి రైతుల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేశారు.
సరఫరాలో తరచూ అంతరాయాలు ఏర్పడటం వల్ల వ్యవసాయ మోటార్లు, ఇతర విద్యుత్ పరికరాలు దెబ్బతినే ప్రమాదం ఉందని, దీంతో రైతులపై అదనపు ఆర్థిక భారం పడుతోందని తెలిపారు. ప్రభుత్వం వెంటనే స్పందించి వ్యవసాయానికి నాణ్యమైన విద్యుత్ సరఫరాను పునరుద్ధరించడంతో పాటు సాగునీటి సమస్యలను పరిష్కరించి రైతుల పంటలను కాపాడాలని కోరారు
కష్టాలను విస్మరించకుండా ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని బీఆర్ఎస్ పార్టీ నాయకులు కేతావత్ బీల్యా నాయక్ స్పష్టం చేశారు. రైతులకు అండగా నిలవడం, వారి సమస్యల పరిష్కారం కోసం కృషి చేయడం బీఆర్ఎస్ పార్టీ బాధ్యతగా భావిస్తుందని తెలిపారు










Leave a Reply