Wednesday, 28 Oct 2026
28 Oct 2026Wednesday
⌕
Home   Reporter Profile
🔴 BREAKING
● ఫాదర్ సందీప్ ఇన్నా రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన మాస్టర్ నాగేశ్వరరావు● రాజాపూర్‌లో పిచ్చికుక్క బీభత్సం.. ఐదుగురికి గాయాలు● రూ.85 లక్షల ఇంటిపై వివాదం.. న్యాయం చేయాలని బాధిత దంపతుల వేడుకోలు● లద్నాపూర్‌లో మినరల్ వాటర్ ప్లాంట్ ప్రారంభించిన మంత్రి శ్రీధర్ బాబు● ప్రజలకు మేలు చేయడమే ప్రజా ప్రభుత్వ లక్ష్యం: మంత్రి శ్రీధర్ బాబు● మార్కెట్ కమిటీ చైర్మన్ వైనాల రాజు కుటుంబాన్ని పరామర్శించిన మంత్రి శ్రీధర్ బాబు● భారీ వర్షంలోనూ వైభవంగా విజయనగరం పైడితల్లమ్మ సిరిమానోత్సవం● రోడ్డు ప్రమాదంలో మార్షల్ ఆర్ట్స్ విద్యార్థులకు తీవ్ర గాయాలు● ఫాదర్ సందీప్ ఇన్నా రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన మాస్టర్ నాగేశ్వరరావు● రాజాపూర్‌లో పిచ్చికుక్క బీభత్సం.. ఐదుగురికి గాయాలు● రూ.85 లక్షల ఇంటిపై వివాదం.. న్యాయం చేయాలని బాధిత దంపతుల వేడుకోలు● లద్నాపూర్‌లో మినరల్ వాటర్ ప్లాంట్ ప్రారంభించిన మంత్రి శ్రీధర్ బాబు● ప్రజలకు మేలు చేయడమే ప్రజా ప్రభుత్వ లక్ష్యం: మంత్రి శ్రీధర్ బాబు● మార్కెట్ కమిటీ చైర్మన్ వైనాల రాజు కుటుంబాన్ని పరామర్శించిన మంత్రి శ్రీధర్ బాబు● భారీ వర్షంలోనూ వైభవంగా విజయనగరం పైడితల్లమ్మ సిరిమానోత్సవం● రోడ్డు ప్రమాదంలో మార్షల్ ఆర్ట్స్ విద్యార్థులకు తీవ్ర గాయాలు
Home › దేవరకొండ › లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో విద్యార్థులకు టై, బెల్టుల బహుకరణ
దేవరకొండ

లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో విద్యార్థులకు టై, బెల్టుల బహుకరణ

12:29 మధ్యాహ్నం PM

విద్యార్థులు ఆలోచనలకు పదును పెట్టాలి: లయన్స్ క్లబ్ అధ్యక్షుడు గుద్దేటి జంగయ్య

AYUSH24 News ప్రతినిధి

దేవరకొండ: సెప్టెంబర్ 30

విద్య ద్వారానే ఉన్నత శిఖరాలను అధిరోహించవచ్చని లయన్స్ క్లబ్ ఆఫ్ దేవరకొండ అధ్యక్షుడు గుద్దేటి జంగయ్య అన్నారు. దేవరకొండ మండలం ముదిగొండ గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థినీ విద్యార్థులకు బుధవారం లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో టై, బెల్టులను అందజేశారు.

ముదిగొండ మాజీ సర్పంచ్ కీర్తిశేషులు కాశిరెడ్డి రఘుమారెడ్డి జ్ఞాపకార్థం ఆయన కుమారుడు, దేవరకొండ లయన్స్ క్లబ్ ప్రధాన కార్యదర్శి, మాజీ ఎంపీటీసీ కాశిరెడ్డి రవీందర్ రెడ్డి (రైతు మిత్ర ఏజెన్సీస్, దేవరకొండ) ఆర్థిక సహాయంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.

ఈ సందర్భంగా బుద్దేటి జంగయ్య మాట్లాడుతూ శిలను శిల్పంగా తీర్చిదిద్దినట్లుగా విద్యార్థులను తీర్చిదిద్దడంలో ఉపాధ్యాయుల పాత్ర కీలకమన్నారు. చిన్నతనం నుంచే విద్యార్థుల్లో ఇతరులకు సహాయం చేసే గుణంతో పాటు విద్యాబుద్ధులను పెంపొందించాలని పేర్కొన్నారు. ప్రతి విద్యార్థి పోటీపడి చదువుతూ ఆలోచనలకు పదును పెట్టి, ప్రపంచానికి ఉపయోగపడే కొత్త ఆవిష్కరణల దిశగా ముందుకు సాగాలని సూచించారు.

దాత కాశిరెడ్డి రవీందర్ రెడ్డికి సన్మానం

తన తండ్రి జ్ఞాపకార్థం విద్యార్థులకు టై, బెల్టులు అందించడంతో పాటు పాఠశాల అభివృద్ధికి కూడా కృషి చేస్తానని కాశిరెడ్డి రవీందర్ రెడ్డి పేర్కొన్నారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు ఆయనను శాలువాతో సన్మానించి కృతజ్ఞతలు తెలిపారు.

కార్యక్రమానికి పాఠశాల హెచ్ఎం తౌరియా నాయక్ సభాధ్యక్షత వహించారు. కోశాధికారి చిలుకూరి కాశీనాథ్, లయన్ డాక్టర్ పి.జె. శ్యామ్‌సన్, మాజీ సర్పంచ్ రేపాని ఇద్దయ్య, వనం శ్రీనివాసులు, జల్దా భాస్కర్, బొడ్డుపల్లి భీష్మాచారి, ఉపాధ్యాయులు పి. లక్ష్మి, పి. రాధారాణి, కె. లక్ష్మణ్, సిహెచ్. వెంకటేశ్వర్లు, వి. శ్రీనివాస్, వజీర్, ఎం. అంజయ్య , ఎం. సులోచనతో పాటు విద్యార్థినీ విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

ఆయుష్ 24 న్యూస్ — The Voice of Truth

📲 వార్తను షేర్ చేయండి
🟢 WhatsApp🔵 Facebook
👁 Views: 61🔗 Shares: 4👍 Likes: 0
🇮🇳 జాతీయ స్థాయి రిపోర్టర్ నియామకంమీ ప్రాంతం నుంచి AYUSH24 NEWS కోసం వార్తలను అందించండి.
AYUSH24 NEWS Reporter
219 published stories

AYUSH24 NEWS Reporter Network

మీ ప్రాంతం నుంచి వార్తలు అందించాలనుకుంటున్నారా? మా Reporter Networkలో చేరండి.

Become a Reporter →

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

📱 Download App