Wednesday, 28 Oct 2026
28 Oct 2026Wednesday
⌕
Home   Reporter Profile
🔴 BREAKING
● భారీ వర్షంలోనూ వైభవంగా విజయనగరం పైడితల్లమ్మ సిరిమానోత్సవం● రోడ్డు ప్రమాదంలో మార్షల్ ఆర్ట్స్ విద్యార్థులకు తీవ్ర గాయాలు● మాజీ సర్పంచ్ రాకేష్ తండ్రి మృతి పట్ల సంతాపం తెలిపిన డాక్టర్ దూదిపాల వేణుధర్ రెడ్డి● నవంబర్ 6లోగా పట్టభద్రులు ఓటు నమోదు చేసుకోవాలి● బీసీల రాజ్యాధికారమే మా ధ్యేయం: తీన్మార్ మల్లన్న● దేవరకొండ నియోజకవర్గంలో రేపు ఎమ్మెల్యే బాలు నాయక్ పర్యటన● రోడ్డు ప్రమాదంలో గాయపడిన యువకుడిని పరామర్శించిన ఎమ్మెల్యే బాలు నాయక్● సిటీ సివిల్ కోర్టును సందర్శించిన MSS లా కళాశాల విద్యార్థులు● భారీ వర్షంలోనూ వైభవంగా విజయనగరం పైడితల్లమ్మ సిరిమానోత్సవం● రోడ్డు ప్రమాదంలో మార్షల్ ఆర్ట్స్ విద్యార్థులకు తీవ్ర గాయాలు● మాజీ సర్పంచ్ రాకేష్ తండ్రి మృతి పట్ల సంతాపం తెలిపిన డాక్టర్ దూదిపాల వేణుధర్ రెడ్డి● నవంబర్ 6లోగా పట్టభద్రులు ఓటు నమోదు చేసుకోవాలి● బీసీల రాజ్యాధికారమే మా ధ్యేయం: తీన్మార్ మల్లన్న● దేవరకొండ నియోజకవర్గంలో రేపు ఎమ్మెల్యే బాలు నాయక్ పర్యటన● రోడ్డు ప్రమాదంలో గాయపడిన యువకుడిని పరామర్శించిన ఎమ్మెల్యే బాలు నాయక్● సిటీ సివిల్ కోర్టును సందర్శించిన MSS లా కళాశాల విద్యార్థులు
Home › బ్రేకింగ్ న్యూస్ › వర్షాభావ పరిస్థితుల్లో ప్రత్యామ్నాయ పంటల సాగుకు ప్రాధాన్యం ఇవ్వాలి
బ్రేకింగ్ న్యూస్

వర్షాభావ పరిస్థితుల్లో ప్రత్యామ్నాయ పంటల సాగుకు ప్రాధాన్యం ఇవ్వాలి

చింతపల్లి, అక్టోబర్ 15 (ఆయుష్ 24 న్యూస్): వర్షాభావ పరిస్థితులు, భూగర్భ జలాల తగ్గుదల నేపథ్యంలో రైతులు నీటి లభ్యతకు అనుగుణంగా ప్రత్యామ్నాయ పంటల సాగుపై దృష్టి సారించాలని దేవరకొండ ఎమ్మెల్యే నేనావత్ బాలు నాయక్ సూచించారు. గురువారం చింతపల్లి మండల కేంద్రంలోని రైతువేదికలో వ్యవసాయ శాఖ, ఫార్మర్

02:54 మధ్యాహ్నం PM

చింతపల్లి, అక్టోబర్ 15 (ఆయుష్ 24 న్యూస్): వర్షాభావ పరిస్థితులు, భూగర్భ జలాల తగ్గుదల నేపథ్యంలో రైతులు నీటి లభ్యతకు అనుగుణంగా ప్రత్యామ్నాయ పంటల సాగుపై దృష్టి సారించాలని దేవరకొండ ఎమ్మెల్యే నేనావత్ బాలు నాయక్ సూచించారు. గురువారం చింతపల్లి మండల కేంద్రంలోని రైతువేదికలో వ్యవసాయ శాఖ, ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్ (ఎఫ్‌పీఓ) ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని రైతులకు వేరుశనగ విత్తనాలను పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే బాలు నాయక్ మాట్లాడుతూ.. రైతుల సంక్షేమం, వ్యవసాయ రంగ అభివృద్ధికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని తెలంగాణ ప్రజా ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. రైతు భరోసా, పంట రుణమాఫీ, ఉచిత విద్యుత్ వంటి పథకాల ద్వారా రైతులకు ప్రభుత్వం అండగా నిలుస్తోందన్నారు. ప్రస్తుత వాతావరణ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని పంటలను ఎంపిక చేసుకోవడం ద్వారా సాగు ఖర్చులు తగ్గించుకోవడంతో పాటు పంట నష్టాలను నివారించే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు.
వరికి ప్రత్యామ్నాయంగా ఆరుతడి పంటల సాగు
ఎల్‌నినో ప్రభావంతో వర్షపాతం, నీటి లభ్యతలో మార్పులు చోటుచేసుకునే అవకాశాలున్న నేపథ్యంలో రైతులు అప్రమత్తంగా ఉండాలని ఎమ్మెల్యే సూచించారు. వ్యవసాయ శాఖ అధికారుల సలహాల మేరకు వేరుశనగ, మినుములు, పెసర, జొన్న వంటి తక్కువ నీటితో సాగు చేయగల ప్రత్యామ్నాయ పంటల వైపు మొగ్గు చూపాలని తెలిపారు. నీటి వనరులు పరిమితంగా ఉన్న ప్రాంతాల్లో అధిక నీరు అవసరమయ్యే పంటల సాగు విషయంలో ముందస్తు ప్రణాళికతో వ్యవహరించాలని సూచించారు.
సాగులో మెళకువలు పాటించాలి
ఈ కార్యక్రమంలో పాల్గొన్న దేవరకొండ డివిజన్ సహాయ వ్యవసాయ సంచాలకులు శ్రీలక్ష్మి మాట్లాడుతూ.. ప్రస్తుత వర్షాభావ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని రైతులు పంటల ఎంపికలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. తక్కువ నీటి వనరులతో సాగు చేయగల పంటలకు ప్రాధాన్యం ఇవ్వాలని, విత్తన శుద్ధి, ఎరువుల వినియోగం, తెగుళ్ల నివారణ వంటి అంశాల్లో వ్యవసాయ నిపుణుల సూచనలు పాటించాలని వివరించారు.
రైతులకు నాణ్యమైన విత్తనాలు అందుబాటులో ఉండేలా, సాగుకు అవసరమైన సాంకేతిక సలహాలు అందించేలా వ్యవసాయ శాఖ అధికారులు కృషి చేయాలని ఎమ్మెల్యే బాలు నాయక్ సూచించారు. ప్రభుత్వం అమలు చేస్తున్న వ్యవసాయ సంక్షేమ పథకాలను అర్హులైన రైతులు సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు.
కార్యక్రమంలో పలువురు నాయకులు, రైతులు
ఈ కార్యక్రమంలో దొంతం అలివేలు సంజీవరెడ్డి, జటావత్ హరినాయక్, కొండూరి పవన్ కుమార్, ముచ్చర్ల గిరి, అంగిరేకుల నాగభూషణం, ఎరుకల వెంకటయ్య గౌడ్, లింగంపల్లి వెంకటయ్య, దాసరి శ్రీనివాస్ యాదవ్‌తో పాటు సంబంధిత శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, రైతులు తదితరులు పాల్గొన్నారు.
— ఆయుష్ 24 న్యూస్ | ప్రజల గొంతుక, ప్రజా సమస్యల ప్రతిధ్వని

📲 వార్తను షేర్ చేయండి
🟢 WhatsApp🔵 Facebook
👁 Views: 26🔗 Shares: 1👍 Likes: 1
🇮🇳 జాతీయ స్థాయి రిపోర్టర్ నియామకంమీ ప్రాంతం నుంచి AYUSH24 NEWS కోసం వార్తలను అందించండి.
AYUSH24 NEWS Reporter
259 published stories

AYUSH24 NEWS Reporter Network

మీ ప్రాంతం నుంచి వార్తలు అందించాలనుకుంటున్నారా? మా Reporter Networkలో చేరండి.

Become a Reporter →

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

📱 Download App