హైదరాబాద్: కొప్పుల పరమేశ్వరి – జంగయ్య దంపతుల చిన్నారులు వర్షిత, అదితి, రోహన్ కృష్ణల నూతన పట్టు వస్త్రాలంకరణ మహోత్సవంలో దేవరకొండ శాసనసభ్యులు శ్రీ నేనావత్ బాలు నాయక్ పాల్గొన్నారు.
హైదరాబాద్లోని ప్రమిద కన్వెన్షన్ హాల్లో ఆదివారం కుటుంబ సభ్యులు, బంధుమిత్రుల సమక్షంలో ఈ వేడుకను ఆనందోత్సాహాల మధ్య ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బాలు నాయక్ కుటుంబ సభ్యులను ఆప్యాయంగా పలకరించి, చిన్నారులకు శుభాకాంక్షలు తెలిపారు.
చిన్నారులు ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో వర్ధిల్లుతూ జీవితంలో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఎమ్మెల్యే ఆకాంక్షించారు. అనంతరం కుటుంబ సభ్యులతో కొంతసేపు ముచ్చటించి, వేడుకలో పాల్గొన్నారు.
ఈ కార్యక్రమంలో జాటావత్ హరి నాయక్, కొండూరు పవన్ కుమార్, మునుకుంట్ల శేఖర్, నేనావత్ వసంత్ నాయక్, నేనావత్ జవహర్ లాల్, గౌని జంగయ్య, దుబ్బాకుల మదార్, కొప్పుల అశోక్ గౌడ్, కోటిదొడ్డి శంకర్, రాజు తదితరులు పాల్గొన్నారు.
📰 Ayush 24 News
వర్షిత, అదితి, రోహన్ కృష్ణల నూతన పట్టు వస్త్రాలంకరణ మహోత్సవంలో పాల్గొన్న ఎమ్మెల్యే బాలు నాయక్
హైదరాబాద్: కొప్పుల పరమేశ్వరి – జంగయ్య దంపతుల చిన్నారులు వర్షిత, అదితి, రోహన్ కృష్ణల నూతన పట్టు వస్త్రాలంకరణ మహోత్సవంలో దేవరకొండ శాసనసభ్యులు శ్రీ నేనావత్ బాలు నాయక్ పాల్గొన్నారు. హైదరాబాద్లోని ప్రమిద కన్వెన్షన్ హాల్లో ఆదివారం కుటుంబ సభ్యులు, బంధుమిత్రుల సమక్షంలో ఈ వేడుకను ఆనందోత్సాహాల మధ్య


AYUSH24 NEWS Reporter Network
మీ ప్రాంతం నుంచి వార్తలు అందించాలనుకుంటున్నారా? మా Reporter Networkలో చేరండి.
Become a Reporter →








Leave a Reply