Wednesday, 28 Oct 2026
28 Oct 2026Wednesday
⌕
Home   Reporter Profile
🔴 BREAKING
● భారీ వర్షంలోనూ వైభవంగా విజయనగరం పైడితల్లమ్మ సిరిమానోత్సవం● రోడ్డు ప్రమాదంలో మార్షల్ ఆర్ట్స్ విద్యార్థులకు తీవ్ర గాయాలు● మాజీ సర్పంచ్ రాకేష్ తండ్రి మృతి పట్ల సంతాపం తెలిపిన డాక్టర్ దూదిపాల వేణుధర్ రెడ్డి● నవంబర్ 6లోగా పట్టభద్రులు ఓటు నమోదు చేసుకోవాలి● బీసీల రాజ్యాధికారమే మా ధ్యేయం: తీన్మార్ మల్లన్న● దేవరకొండ నియోజకవర్గంలో రేపు ఎమ్మెల్యే బాలు నాయక్ పర్యటన● రోడ్డు ప్రమాదంలో గాయపడిన యువకుడిని పరామర్శించిన ఎమ్మెల్యే బాలు నాయక్● సిటీ సివిల్ కోర్టును సందర్శించిన MSS లా కళాశాల విద్యార్థులు● భారీ వర్షంలోనూ వైభవంగా విజయనగరం పైడితల్లమ్మ సిరిమానోత్సవం● రోడ్డు ప్రమాదంలో మార్షల్ ఆర్ట్స్ విద్యార్థులకు తీవ్ర గాయాలు● మాజీ సర్పంచ్ రాకేష్ తండ్రి మృతి పట్ల సంతాపం తెలిపిన డాక్టర్ దూదిపాల వేణుధర్ రెడ్డి● నవంబర్ 6లోగా పట్టభద్రులు ఓటు నమోదు చేసుకోవాలి● బీసీల రాజ్యాధికారమే మా ధ్యేయం: తీన్మార్ మల్లన్న● దేవరకొండ నియోజకవర్గంలో రేపు ఎమ్మెల్యే బాలు నాయక్ పర్యటన● రోడ్డు ప్రమాదంలో గాయపడిన యువకుడిని పరామర్శించిన ఎమ్మెల్యే బాలు నాయక్● సిటీ సివిల్ కోర్టును సందర్శించిన MSS లా కళాశాల విద్యార్థులు
Home › బ్రేకింగ్ న్యూస్ › విద్యుత్ చార్జీల పెంపు ఆలోచనను విరమించుకోవాలి
బ్రేకింగ్ న్యూస్

విద్యుత్ చార్జీల పెంపు ఆలోచనను విరమించుకోవాలి

నిడమనూరు, అక్టోబర్ 9 (ఆయుష్ 24 న్యూస్): ట్రూ అప్ చార్జీల పేరుతో విద్యుత్ చార్జీలను పెంచే ఆలోచనను ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ (ఈఆర్‌సీ) విరమించుకోవాలని, రూ.5,420.23 కోట్ల భారాన్ని ప్రభుత్వమే భరించాలని సీపీఎం జిల్లా కమిటీ సభ్యులు కొండేటి శ్రీను డిమాండ్ చేశారు. నవంబర్ 15 నుంచి

06:18 సాయంత్రం PM

నిడమనూరు, అక్టోబర్ 9 (ఆయుష్ 24 న్యూస్): ట్రూ అప్ చార్జీల పేరుతో విద్యుత్ చార్జీలను పెంచే ఆలోచనను ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ (ఈఆర్‌సీ) విరమించుకోవాలని, రూ.5,420.23 కోట్ల భారాన్ని ప్రభుత్వమే భరించాలని సీపీఎం జిల్లా కమిటీ సభ్యులు కొండేటి శ్రీను డిమాండ్ చేశారు.
నవంబర్ 15 నుంచి 18 వరకు నల్లగొండలో నిర్వహించనున్న అఖిల భారత రైతు సంఘం 36వ జాతీయ మహాసభలను విజయవంతం చేయాలని కోరుతూ శుక్రవారం నిడమనూరు మండల కేంద్రంలో ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఇప్పటికే నిత్యావసర వస్తువులు, గ్యాస్, పెట్రోల్, డీజిల్ ధరల పెరుగుదలతో ప్రజలు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. ఎల్‌నినో ప్రభావంతో కరువు పరిస్థితులు ఎదురయ్యే సమయంలో విద్యుత్ చార్జీలు పెంచడం ప్రజలపై మరింత భారం మోపడమేనని పేర్కొన్నారు.
ప్రభుత్వ శాఖల నుంచి రావాల్సిన రూ.57,336 కోట్ల బకాయిలను వసూలు చేయకుండా ప్రజలపై అదనపు భారాలు వేయడం ఏమిటని ఆయన ప్రశ్నించారు. విద్యుత్ చార్జీల పెంపు నిర్ణయాన్ని వెంటనే విరమించుకోకపోతే రాష్ట్రవ్యాప్తంగా మరో విద్యుత్ ఉద్యమానికి సిద్ధం కావాల్సి వస్తుందని హెచ్చరించారు.
రాష్ట్రంలో విద్యుత్ కోతల కారణంగా పంట పొలాలు ఎండిపోతున్నాయని, రైతులకు ఏడు గంటల విద్యుత్ కూడా సక్రమంగా అందడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. తరచూ విద్యుత్ సరఫరాలో అంతరాయాలు ఏర్పడటంతో స్టార్టర్లు, మోటార్లు కాలిపోయి రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. రైతులకు నిరంతరాయంగా విద్యుత్ సరఫరా చేసి పంటలను కాపాడాలని ప్రభుత్వాన్ని కోరారు.
నవంబర్ 15న నల్లగొండలో నిర్వహించనున్న రైతు సంఘం జాతీయ మహాసభల బహిరంగ సభకు రైతులు, ప్రజలు పెద్ద ఎత్తున తరలిరావాలని పిలుపునిచ్చారు. వ్యవసాయ రంగ పరిరక్షణ, రైతుల సంక్షేమం కోసం చేపట్టాల్సిన ఉద్యమ కార్యాచరణను జాతీయ మహాసభల్లో చర్చించి రూపొందించనున్నట్లు తెలిపారు. మహాసభల విజయవంతానికి ప్రజలందరూ సహకరించాలని కోరారు.
ఈ కార్యక్రమంలో సీపీఎం మండల కమిటీ సభ్యులు కోమండ్ల గురువయ్య, వింజమూరు శివ, ముత్యాల కేశవులు, కోటేష్, యాదయ్య, సైదమ్మ, మేరమ్మ తదితరులు పాల్గొన్నారు.
— ఆయుష్ 24 న్యూస్
The Voice of Truth

📲 వార్తను షేర్ చేయండి
🟢 WhatsApp🔵 Facebook
👁 Views: 8🔗 Shares: 0👍 Likes: 0
🇮🇳 జాతీయ స్థాయి రిపోర్టర్ నియామకంమీ ప్రాంతం నుంచి AYUSH24 NEWS కోసం వార్తలను అందించండి.
AYUSH24 NEWS Reporter
259 published stories

AYUSH24 NEWS Reporter Network

మీ ప్రాంతం నుంచి వార్తలు అందించాలనుకుంటున్నారా? మా Reporter Networkలో చేరండి.

Become a Reporter →

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

📱 Download App