సంస్కృతి, సంప్రదాయాలకు అద్దం పట్టేలా వినాయక నిమజ్జన ఊరేగింపు
మంథని, సెప్టెంబర్ 21 (ప్రతినిధి): మంథని పట్టణంలోని శ్రీ మహా గణపతి దేవాలయంలో గణపతి నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకుని ఏర్పాటు చేసిన విఘ్నేశ్వరుని నిమజ్జన కార్యక్రమాన్ని సోమవారం భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. వేదమంత్రాల నడుమ సంస్కృతి, సంప్రదాయాలకు అద్దం పట్టేలా సాగిన వినాయక నిమజ్జన ఊరేగింపు భక్తులను విశేషంగా ఆకట్టుకుంది.

భక్తి గీతాల నడుమ కొనసాగిన నిమజ్జన ఊరేగింపులో వేద పాఠశాల ఉపాధ్యాయులు బ్రహ్మశ్రీ ఒజ్జల గణేష్ శర్మ ఆధ్వర్యంలో వేద విద్యార్థులు సంప్రదాయ దుస్తులు ధరించి పాల్గొన్నారు. వేదమంత్రాల పఠనంతో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది.
సంస్కృతి, సంప్రదాయాలకు ప్రత్యేక గుర్తింపు ఉన్న మంథని పట్టణంలో నవరాత్రి ఉత్సవాలను సంప్రదాయబద్ధంగా నిర్వహించడం భక్తులను ఆకట్టుకుంది. నిమజ్జన ఊరేగింపులో మహిళా భక్తులు సంప్రదాయ దుస్తుల్లో పాల్గొనడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
ఈ కార్యక్రమంలో మహావాది విజయ్ కుమార్, మహావాది శివ, ఆలయ అర్చకులు పల్లి రాము, వేద పాఠశాల విద్యార్థులు కౌండిన్య, శ్రీనందన్, దేవిశ్రీ ప్రసాద్, సుమేద, శ్రీవత్సవ, అశ్విన్, అభిరామ్ తదితరులు పాల్గొన్నారు.










Leave a Reply