Wednesday, 28 Oct 2026
28 Oct 2026Wednesday
⌕
Home   Reporter Profile
🔴 BREAKING
● భారీ వర్షంలోనూ వైభవంగా విజయనగరం పైడితల్లమ్మ సిరిమానోత్సవం● రోడ్డు ప్రమాదంలో మార్షల్ ఆర్ట్స్ విద్యార్థులకు తీవ్ర గాయాలు● మాజీ సర్పంచ్ రాకేష్ తండ్రి మృతి పట్ల సంతాపం తెలిపిన డాక్టర్ దూదిపాల వేణుధర్ రెడ్డి● నవంబర్ 6లోగా పట్టభద్రులు ఓటు నమోదు చేసుకోవాలి● బీసీల రాజ్యాధికారమే మా ధ్యేయం: తీన్మార్ మల్లన్న● దేవరకొండ నియోజకవర్గంలో రేపు ఎమ్మెల్యే బాలు నాయక్ పర్యటన● రోడ్డు ప్రమాదంలో గాయపడిన యువకుడిని పరామర్శించిన ఎమ్మెల్యే బాలు నాయక్● సిటీ సివిల్ కోర్టును సందర్శించిన MSS లా కళాశాల విద్యార్థులు● భారీ వర్షంలోనూ వైభవంగా విజయనగరం పైడితల్లమ్మ సిరిమానోత్సవం● రోడ్డు ప్రమాదంలో మార్షల్ ఆర్ట్స్ విద్యార్థులకు తీవ్ర గాయాలు● మాజీ సర్పంచ్ రాకేష్ తండ్రి మృతి పట్ల సంతాపం తెలిపిన డాక్టర్ దూదిపాల వేణుధర్ రెడ్డి● నవంబర్ 6లోగా పట్టభద్రులు ఓటు నమోదు చేసుకోవాలి● బీసీల రాజ్యాధికారమే మా ధ్యేయం: తీన్మార్ మల్లన్న● దేవరకొండ నియోజకవర్గంలో రేపు ఎమ్మెల్యే బాలు నాయక్ పర్యటన● రోడ్డు ప్రమాదంలో గాయపడిన యువకుడిని పరామర్శించిన ఎమ్మెల్యే బాలు నాయక్● సిటీ సివిల్ కోర్టును సందర్శించిన MSS లా కళాశాల విద్యార్థులు
Home › బ్రేకింగ్ న్యూస్ › శరీర అవయవ దాతల సంఘం రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీగా లయన్ సముద్రాల ధనంజయ ఎన్నిక
బ్రేకింగ్ న్యూస్

శరీర అవయవ దాతల సంఘం రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీగా లయన్ సముద్రాల ధనంజయ ఎన్నిక

హైదరాబాద్, అక్టోబర్ 15 (ఆయుష్ 24 న్యూస్): అఖిల భారత శరీర అవయవ దాతల సంఘం, సావిత్రిబాయి పూలే ఎడ్యుకేషనల్ చారిటబుల్ ట్రస్ట్ తెలంగాణ రాష్ట్ర కమిటీ నూతన నియామకాల్లో భాగంగా దేవరకొండ పట్టణానికి చెందిన లయన్ సముద్రాల ధనంజయ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీగా నియమితులయ్యారు. గురువారం హైదరాబాద్‌లో

02:54 మధ్యాహ్నం PM

హైదరాబాద్, అక్టోబర్ 15 (ఆయుష్ 24 న్యూస్): అఖిల భారత శరీర అవయవ దాతల సంఘం, సావిత్రిబాయి పూలే ఎడ్యుకేషనల్ చారిటబుల్ ట్రస్ట్ తెలంగాణ రాష్ట్ర కమిటీ నూతన నియామకాల్లో భాగంగా దేవరకొండ పట్టణానికి చెందిన లయన్ సముద్రాల ధనంజయ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీగా నియమితులయ్యారు. గురువారం హైదరాబాద్‌లో నిర్వహించిన రాష్ట్ర కమిటీ సమావేశంలో ఆయన నియామకాన్ని ప్రకటించి, నియామక పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా పలువురు ప్రముఖులు ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ.. ‘మరణించినా జీవించండి’ అనే నినాదంతో దేశవ్యాప్తంగా శరీరదానం, అవయవదానంపై ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నట్లు తెలిపారు. మరణానంతరం శరీరాన్ని వైద్య విద్య, పరిశోధనల కోసం దానం చేయడంతో పాటు, అవయవదానం ద్వారా మరెందరికో ప్రాణదానం చేసే అవకాశం ఉందని పేర్కొన్నారు.
అఖిల భారత శరీర అవయవ దాతల సంఘాన్ని స్థాపించి దేశవ్యాప్తంగా మానవీయ విలువలతో కూడిన అవయవదాన ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్తున్నట్లు వివరించారు. ఈ ఉద్యమాన్ని మరింత విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లడంతో పాటు, శరీరదానం, అవయవదానంపై అపోహలను తొలగించి, ప్రజలకు అవగాహన కల్పించాలనే లక్ష్యంతో నూతన కమిటీలను ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు.
రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీగా నియమితులైన లయన్ సముద్రాల ధనంజయ భవిష్యత్తులో అవయవదాన ఉద్యమ విస్తరణకు కృషి చేస్తారని నిర్వాహకులు ఆశాభావం వ్యక్తం చేశారు. అవయవదానంపై ప్రజల్లో చైతన్యం పెంపొందించేందుకు సంఘం చేపట్టే కార్యక్రమాలను మరింత ముందుకు తీసుకెళ్లాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో సంఘం చీఫ్ మెంటర్ డాక్టర్ ఎస్. విజయ్ కుమార్, చైర్‌పర్సన్ డాక్టర్ గూడూరు సీతామహాలక్ష్మి, మేనేజింగ్ ట్రస్టీ ప్రొఫెసర్ ఆనంద్ స్వరూప్‌తో పాటు పలువురు పాల్గొన్నారు.
ఆయుష్ 24 న్యూస్

📲 వార్తను షేర్ చేయండి
🟢 WhatsApp🔵 Facebook
👁 Views: 8🔗 Shares: 0👍 Likes: 0
🇮🇳 జాతీయ స్థాయి రిపోర్టర్ నియామకంమీ ప్రాంతం నుంచి AYUSH24 NEWS కోసం వార్తలను అందించండి.
AYUSH24 NEWS Reporter
259 published stories

AYUSH24 NEWS Reporter Network

మీ ప్రాంతం నుంచి వార్తలు అందించాలనుకుంటున్నారా? మా Reporter Networkలో చేరండి.

Become a Reporter →

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

📱 Download App