భక్తిశ్రద్ధలతో ప్రత్యేక పూజలు.. అన్నప్రసాదం ఏర్పాటు
దేవరకొండ, సెప్టెంబర్ 22 (ప్రతినిధి):
దేవరకొండ పట్టణంలోని శ్రీ అయ్యప్ప స్వామి దేవాలయంలో శ్రీ అయ్యప్ప సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో గణపతి పూజా కార్యక్రమాన్ని భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ట్రస్ట్ సభ్యులు, అయ్యప్ప స్వాములు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో ట్రస్ట్ అధ్యక్షుడు నక్క వెంకటేష్ యాదవ్, సత్యమ్మ, కార్యదర్శి చిలువేరు శ్రీనివాస్, మాధవి, తాడూరి సత్యనారాయణ, మల్లిక దంపతులు, సంగిశెట్టి జ్యోత్స్న తదితరులు పాల్గొని గణపతి పూజ నిర్వహించారు.
కార్యక్రమానికి దేవరకొండ ఎమ్మెల్యే బాలు నాయక్, మున్సిపల్ చైర్పర్సన్ పున్న శైలజ వెంకటేష్, ఆలంపల్లి నరసింహ, గురుస్వాములు చిలువేరు చంద్రమౌళి, నాగేశ్వర్ తదితరులు హాజరయ్యారు.

లడ్డూ, కలశం వేలం
గణపతి లడ్డూ వేలం పాటలో చిలువేరు చంద్రమౌళి రూ.55,555కు లడ్డూను దక్కించుకున్నారు. కలశం వేలంపాటలో గంజి శ్రీనివాస్, స్వాతి దంపతులు రూ.21,116కు కలశాన్ని దక్కించుకున్నారు.
ఈ సందర్భంగా శ్రీ అయ్యప్ప సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో భక్తుల కోసం మధ్యాహ్నం అన్నప్రసాద కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. పెద్ద సంఖ్యలో భక్తులు, అయ్యప్ప స్వాములు, ట్రస్ట్ సభ్యులు, స్థానికులు పాల్గొని స్వామివారి ఆశీస్సులు పొందారు.










Leave a Reply