Wednesday, 28 Oct 2026
28 Oct 2026Wednesday
⌕
Home   Reporter Profile
🔴 BREAKING
● రాజాపూర్‌లో పిచ్చికుక్క బీభత్సం.. ఐదుగురికి గాయాలు● రూ.85 లక్షల ఇంటిపై వివాదం.. న్యాయం చేయాలని బాధిత దంపతుల వేడుకోలు● లద్నాపూర్‌లో మినరల్ వాటర్ ప్లాంట్ ప్రారంభించిన మంత్రి శ్రీధర్ బాబు● ప్రజలకు మేలు చేయడమే ప్రజా ప్రభుత్వ లక్ష్యం: మంత్రి శ్రీధర్ బాబు● మార్కెట్ కమిటీ చైర్మన్ వైనాల రాజు కుటుంబాన్ని పరామర్శించిన మంత్రి శ్రీధర్ బాబు● భారీ వర్షంలోనూ వైభవంగా విజయనగరం పైడితల్లమ్మ సిరిమానోత్సవం● రోడ్డు ప్రమాదంలో మార్షల్ ఆర్ట్స్ విద్యార్థులకు తీవ్ర గాయాలు● మాజీ సర్పంచ్ రాకేష్ తండ్రి మృతి పట్ల సంతాపం తెలిపిన డాక్టర్ దూదిపాల వేణుధర్ రెడ్డి● రాజాపూర్‌లో పిచ్చికుక్క బీభత్సం.. ఐదుగురికి గాయాలు● రూ.85 లక్షల ఇంటిపై వివాదం.. న్యాయం చేయాలని బాధిత దంపతుల వేడుకోలు● లద్నాపూర్‌లో మినరల్ వాటర్ ప్లాంట్ ప్రారంభించిన మంత్రి శ్రీధర్ బాబు● ప్రజలకు మేలు చేయడమే ప్రజా ప్రభుత్వ లక్ష్యం: మంత్రి శ్రీధర్ బాబు● మార్కెట్ కమిటీ చైర్మన్ వైనాల రాజు కుటుంబాన్ని పరామర్శించిన మంత్రి శ్రీధర్ బాబు● భారీ వర్షంలోనూ వైభవంగా విజయనగరం పైడితల్లమ్మ సిరిమానోత్సవం● రోడ్డు ప్రమాదంలో మార్షల్ ఆర్ట్స్ విద్యార్థులకు తీవ్ర గాయాలు● మాజీ సర్పంచ్ రాకేష్ తండ్రి మృతి పట్ల సంతాపం తెలిపిన డాక్టర్ దూదిపాల వేణుధర్ రెడ్డి
Home › బ్రేకింగ్ న్యూస్ › సర్పంచుల సమస్యల పరిష్కారానికి కృషి చేయాలి – దేవరకొండ మాజీ ఎమ్మెల్యే రమావత్ రవీంద్ర కుమార్
బ్రేకింగ్ న్యూస్

సర్పంచుల సమస్యల పరిష్కారానికి కృషి చేయాలి – దేవరకొండ మాజీ ఎమ్మెల్యే రమావత్ రవీంద్ర కుమార్

దేవరకొండ, సెప్టెంబర్ 28: సర్పంచుల సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని దేవరకొండ మాజీ శాసనసభ్యులు రమావత్ రవీంద్ర కుమార్ అన్నారు. తెలంగాణ పంచాయతీరాజ్ ఛాంబర్–నల్గొండ జిల్లా సర్పంచుల సంఘం ప్రధాన కార్యదర్శిగా ఎన్నికైన చందంపేట మండలం చిత్రియాల గ్రామపంచాయతీ సర్పంచ్ చాట్ల చిరంజీవిని సోమవారం దేవరకొండ పట్టణంలోని పార్టీ

10:36 ఉదయం AM

దేవరకొండ, సెప్టెంబర్ 28: సర్పంచుల సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని దేవరకొండ మాజీ శాసనసభ్యులు రమావత్ రవీంద్ర కుమార్ అన్నారు.
తెలంగాణ పంచాయతీరాజ్ ఛాంబర్–నల్గొండ జిల్లా సర్పంచుల సంఘం ప్రధాన కార్యదర్శిగా ఎన్నికైన చందంపేట మండలం చిత్రియాల గ్రామపంచాయతీ సర్పంచ్ చాట్ల చిరంజీవిని సోమవారం దేవరకొండ పట్టణంలోని పార్టీ కార్యాలయంలో రమావత్ రవీంద్ర కుమార్ శాలువాతో సత్కరించి అభినందించారు.
ఈ సందర్భంగా రవీంద్ర కుమార్ మాట్లాడుతూ.. నల్గొండ జిల్లా సర్పంచుల సంఘం ప్రధాన కార్యదర్శిగా చాట్ల చిరంజీవి ఎన్నిక కావడం అభినందనీయమన్నారు. గ్రామపంచాయతీలకు సంబంధించిన సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడంతో పాటు, సర్పంచుల సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని సూచించారు.
గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి ప్రజాప్రతినిధులు, సర్పంచులు సమన్వయంతో పనిచేయాల్సిన అవసరం ఉందన్నారు. సర్పంచుల సమస్యలను ఎప్పటికప్పుడు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి వాటి పరిష్కారానికి కృషి చేయాలని కోరారు.
నల్గొండ జిల్లా సర్పంచుల సంఘం ప్రధాన కార్యదర్శిగా చాట్ల చిరంజీవి తన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించాలని రవీంద్ర కుమార్ ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో మాజీ జడ్పీటీసీ బోయపల్లి శ్రీనివాస్ గౌడ్, మాజీ బీఆర్‌ఎస్ పార్టీ మండల కార్యదర్శి కేతావత్ శంకర్ నాయక్, సర్పంచ్ రమావత్ కిషన్, మాజీ సర్పంచ్ కొండల్ రెడ్డి, బాణావత్ భారత, బొడ్డుపల్లి కృష్ణ తదితరులు పాల్గొన్నారు.
— Ayush24 News
The Voice of Truth

📲 వార్తను షేర్ చేయండి
🟢 WhatsApp🔵 Facebook
👁 Views: 28🔗 Shares: 1👍 Likes: 0
🇮🇳 జాతీయ స్థాయి రిపోర్టర్ నియామకంమీ ప్రాంతం నుంచి AYUSH24 NEWS కోసం వార్తలను అందించండి.
AYUSH24 NEWS Reporter
259 published stories

AYUSH24 NEWS Reporter Network

మీ ప్రాంతం నుంచి వార్తలు అందించాలనుకుంటున్నారా? మా Reporter Networkలో చేరండి.

Become a Reporter →

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

📱 Download App