డిండి: వావిల్కోల్ గ్రామ సర్పంచ్ పేర్వాల జంగారెడ్డి నూతన గృహప్రవేశ వేడుకలో దేవరకొండ ఎమ్మెల్యే శ్రీ నేనావత్ బాలు నాయక్ పాల్గొని శుభాకాంక్షలు తెలిపారు.
శుక్రవారం నిర్వహించిన ఈ గృహప్రవేశ కార్యక్రమంలో ఎమ్మెల్యే బాలు నాయక్ పాల్గొని నూతన గృహంలోకి అడుగుపెట్టిన పేర్వాల జంగారెడ్డి, వారి కుటుంబ సభ్యులను అభినందించారు. ఈ సందర్భంగా కుటుంబ సభ్యులతో ఆప్యాయంగా ముచ్చటించి, నూతన గృహంలో సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు వెల్లివిరియాలని ఆకాంక్షిస్తూ ఆశీర్వదించారు.
ప్రజా జీవితంలో ప్రజలకు అందుబాటులో ఉంటూ గ్రామ అభివృద్ధికి కృషి చేస్తున్న ప్రజాప్రతినిధులకు ఇలాంటి శుభకార్యాలు మరింత ఆనందాన్ని అందిస్తాయని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో డిండి బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు దొంతినేని వెంకటేశ్వరరావు, ముత్యాల శశిధర్ రెడ్డి, నల్లవెల్లి రాజేష్ రెడ్డి, చింతలపూడి భాస్కర్ రెడ్డి, ముచ్చర్ల గిరి, నల్లవెల్లి సదానందం, ప్రజాప్రతినిధులు, బంధుమిత్రులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.
Ayush 24 News
సర్పంచ్ జంగారెడ్డి నూతన గృహప్రవేశ వేడుకలో పాల్గొన్న ఎమ్మెల్యే బాలు నాయక్
డిండి: వావిల్కోల్ గ్రామ సర్పంచ్ పేర్వాల జంగారెడ్డి నూతన గృహప్రవేశ వేడుకలో దేవరకొండ ఎమ్మెల్యే శ్రీ నేనావత్ బాలు నాయక్ పాల్గొని శుభాకాంక్షలు తెలిపారు. శుక్రవారం నిర్వహించిన ఈ గృహప్రవేశ కార్యక్రమంలో ఎమ్మెల్యే బాలు నాయక్ పాల్గొని నూతన గృహంలోకి అడుగుపెట్టిన పేర్వాల జంగారెడ్డి, వారి కుటుంబ సభ్యులను


AYUSH24 NEWS Reporter Network
మీ ప్రాంతం నుంచి వార్తలు అందించాలనుకుంటున్నారా? మా Reporter Networkలో చేరండి.
Become a Reporter →








Leave a Reply