పార్థివ దేహానికి పూలమాల వేసి శ్రద్ధాంజలి
కుటుంబ సభ్యులను పరామర్శించిన మండల కాంగ్రెస్ అధ్యక్షుడు అయిలి ప్రసాద్
మంథని, సెప్టెంబర్ 23 (ప్రతినిధి):
మంథని మండలంలోని రచ్చపల్లి గ్రామ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు సాదుల రాజేందర్ తండ్రి అనారోగ్యంతో మృతి చెందడంతో పలువురు కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆయన పార్థివ దేహానికి పూలమాల వేసి నివాళులర్పించారు.
మంథని మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు అయిలి ప్రసాద్ మృతుడి పార్థివ దేహానికి పూలమాల వేసి శ్రద్ధాంజలి ఘటించారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు. మృతుడితో ఉన్న జ్ఞాపకాలను గుర్తుచేసుకుంటూ ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి జనగామ నర్సింగరావు, రాష్ట్ర సోషల్ మీడియా కార్యదర్శి ఆరెల్లి కిరణ్, నాగరాజు, రమేష్, యూత్ కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.










Leave a Reply