హైదరాబాద్: సింగరేణి కార్మికుల సంక్షేమం, ఉద్యోగుల సొంతింటి కల సాకారం కోసం ప్రజా ప్రభుత్వం కృషి చేస్తోందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు అన్నారు.
ప్రజాభవన్లో నిర్వహించిన ప్రెస్మీట్లో ఆయన మాట్లాడుతూ, తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సింగరేణిలో 3,189 పోస్టులను భర్తీ చేసినట్లు తెలిపారు. ఇందులో 2,437 కారుణ్య నియామకాలు చేపట్టామని వెల్లడించారు. సింగరేణిలో పనిచేస్తున్న సుమారు 30 వేల మంది కాంట్రాక్టు కార్మికుల కోసం రూ.40 లక్షల ప్రమాద బీమా పథకాన్ని అమలు చేస్తున్నామని పేర్కొన్నారు.
సింగరేణి కార్మికులకు రూ.1.20 కోట్ల ప్రమాద బీమా సదుపాయం కల్పిస్తున్నట్లు మంత్రి తెలిపారు. గత పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో సింగరేణి అభివృద్ధి, కొత్త గనుల ఏర్పాటుపై ఏం చేశారో సభలో వివరించాలని సవాల్ చేశారు.
సింగరేణి కార్మికులకు ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తామని, సంస్థను కాపాడుకుంటామని మంత్రి శ్రీధర్ బాబు స్పష్టం చేశారు.
Ayush 24 News – ప్రజల గొంతుక, ప్రజల కోసం!
సింగరేణి కార్మికుల సంక్షేమానికి పెద్దపీట.. సొంతింటి కలను సాకారం చేస్తున్న ప్రజా ప్రభుత్వం
హైదరాబాద్: సింగరేణి కార్మికుల సంక్షేమం, ఉద్యోగుల సొంతింటి కల సాకారం కోసం ప్రజా ప్రభుత్వం కృషి చేస్తోందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు అన్నారు. ప్రజాభవన్లో నిర్వహించిన ప్రెస్మీట్లో ఆయన మాట్లాడుతూ, తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సింగరేణిలో


AYUSH24 NEWS Reporter Network
మీ ప్రాంతం నుంచి వార్తలు అందించాలనుకుంటున్నారా? మా Reporter Networkలో చేరండి.
Become a Reporter →








Leave a Reply