Wednesday, 28 Oct 2026
28 Oct 2026Wednesday
⌕
Home   Reporter Profile
🔴 BREAKING
● భారీ వర్షంలోనూ వైభవంగా విజయనగరం పైడితల్లమ్మ సిరిమానోత్సవం● రోడ్డు ప్రమాదంలో మార్షల్ ఆర్ట్స్ విద్యార్థులకు తీవ్ర గాయాలు● మాజీ సర్పంచ్ రాకేష్ తండ్రి మృతి పట్ల సంతాపం తెలిపిన డాక్టర్ దూదిపాల వేణుధర్ రెడ్డి● నవంబర్ 6లోగా పట్టభద్రులు ఓటు నమోదు చేసుకోవాలి● బీసీల రాజ్యాధికారమే మా ధ్యేయం: తీన్మార్ మల్లన్న● దేవరకొండ నియోజకవర్గంలో రేపు ఎమ్మెల్యే బాలు నాయక్ పర్యటన● రోడ్డు ప్రమాదంలో గాయపడిన యువకుడిని పరామర్శించిన ఎమ్మెల్యే బాలు నాయక్● సిటీ సివిల్ కోర్టును సందర్శించిన MSS లా కళాశాల విద్యార్థులు● భారీ వర్షంలోనూ వైభవంగా విజయనగరం పైడితల్లమ్మ సిరిమానోత్సవం● రోడ్డు ప్రమాదంలో మార్షల్ ఆర్ట్స్ విద్యార్థులకు తీవ్ర గాయాలు● మాజీ సర్పంచ్ రాకేష్ తండ్రి మృతి పట్ల సంతాపం తెలిపిన డాక్టర్ దూదిపాల వేణుధర్ రెడ్డి● నవంబర్ 6లోగా పట్టభద్రులు ఓటు నమోదు చేసుకోవాలి● బీసీల రాజ్యాధికారమే మా ధ్యేయం: తీన్మార్ మల్లన్న● దేవరకొండ నియోజకవర్గంలో రేపు ఎమ్మెల్యే బాలు నాయక్ పర్యటన● రోడ్డు ప్రమాదంలో గాయపడిన యువకుడిని పరామర్శించిన ఎమ్మెల్యే బాలు నాయక్● సిటీ సివిల్ కోర్టును సందర్శించిన MSS లా కళాశాల విద్యార్థులు
Home › బ్రేకింగ్ న్యూస్ › సీరత్‌-ఉన్‌-నబీ జల్సా నేపథ్యంలో పారిశుధ్య పనులు చేపట్టాలి
బ్రేకింగ్ న్యూస్

సీరత్‌-ఉన్‌-నబీ జల్సా నేపథ్యంలో పారిశుధ్య పనులు చేపట్టాలి

దేవరకొండ పట్టణంలో ఈ నెల 31న నిర్వహించనున్న 36వ సీరత్‌-ఉన్‌-నబీ జల్సా (సామూహిక వివాహాలు) నేపథ్యంలో పారిశుధ్య పనులు చేపట్టాలని ఈద్గా, మక్కా మస్జిద్ కమిటీ సభ్యులు మున్సిపల్ కమిషనర్‌ను కోరారు. ఈ మేరకు మంగళవారం కమిషనర్‌కు వినతిపత్రం అందజేశారు. పట్టణంలోని మస్జిద్‌-ఎ-అఖ్సా, మిస్బా ఉల్ మదర్సా, దర్గా-ఎ-హజ్రత్

12:03 మధ్యాహ్నం PM

దేవరకొండ పట్టణంలో ఈ నెల 31న నిర్వహించనున్న 36వ సీరత్‌-ఉన్‌-నబీ జల్సా (సామూహిక వివాహాలు) నేపథ్యంలో పారిశుధ్య పనులు చేపట్టాలని ఈద్గా, మక్కా మస్జిద్ కమిటీ సభ్యులు మున్సిపల్ కమిషనర్‌ను కోరారు. ఈ మేరకు మంగళవారం కమిషనర్‌కు వినతిపత్రం అందజేశారు.
పట్టణంలోని మస్జిద్‌-ఎ-అఖ్సా, మిస్బా ఉల్ మదర్సా, దర్గా-ఎ-హజ్రత్ సయ్యద్ సులేమాన్ షా వలి దర్గా వద్ద ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు తెలిపారు. జల్సాకు ముస్లింలు అధిక సంఖ్యలో హాజరయ్యే అవకాశం ఉన్నందున, ఆయా ప్రాంతాల్లో పారిశుధ్య పనులు చేపట్టాలని విజ్ఞప్తి చేశారు.
మస్జిద్‌, మదర్సా పరిసర ప్రాంతాల్లో పేరుకుపోయిన చెత్తాచెదారాన్ని తొలగించడంతో పాటు, పార్కింగ్‌ ప్రాంతాల్లోనూ పారిశుధ్య పనులు నిర్వహించాలని కోరారు. కార్యక్రమానికి హాజరయ్యే ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా మున్సిపల్ అధికారులు అవసరమైన చర్యలు తీసుకోవాలని కమిషనర్‌కు విజ్ఞప్తి చేశారు.
ఈ కార్యక్రమంలో హాఫిజ్ యండి హబీబొద్దీన్, యండి ఇలియాస్ పటేల్, యం.ఏ. ఖదీర్ సాలర్, మౌలానా అలీమోద్దీన్, యండి సలీమ్, ఖాజా మైనొద్దీన్, సయ్యద్ దస్తగిర్, ఎస్.కె. ఇల్యాస్ బాబా, యండి షకీల్, యండి బాబా తదితరులు పాల్గొన్నారు.
Ayush 24 News

📲 వార్తను షేర్ చేయండి
🟢 WhatsApp🔵 Facebook
👁 Views: 65🔗 Shares: 2👍 Likes: 1
🇮🇳 జాతీయ స్థాయి రిపోర్టర్ నియామకంమీ ప్రాంతం నుంచి AYUSH24 NEWS కోసం వార్తలను అందించండి.
AYUSH24 NEWS Reporter
259 published stories

AYUSH24 NEWS Reporter Network

మీ ప్రాంతం నుంచి వార్తలు అందించాలనుకుంటున్నారా? మా Reporter Networkలో చేరండి.

Become a Reporter →

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

📱 Download App