Wednesday, 28 Oct 2026
28 Oct 2026Wednesday
⌕
Home   Reporter Profile
🔴 BREAKING
● ఫాదర్ సందీప్ ఇన్నా రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన మాస్టర్ నాగేశ్వరరావు● రాజాపూర్‌లో పిచ్చికుక్క బీభత్సం.. ఐదుగురికి గాయాలు● రూ.85 లక్షల ఇంటిపై వివాదం.. న్యాయం చేయాలని బాధిత దంపతుల వేడుకోలు● లద్నాపూర్‌లో మినరల్ వాటర్ ప్లాంట్ ప్రారంభించిన మంత్రి శ్రీధర్ బాబు● ప్రజలకు మేలు చేయడమే ప్రజా ప్రభుత్వ లక్ష్యం: మంత్రి శ్రీధర్ బాబు● మార్కెట్ కమిటీ చైర్మన్ వైనాల రాజు కుటుంబాన్ని పరామర్శించిన మంత్రి శ్రీధర్ బాబు● భారీ వర్షంలోనూ వైభవంగా విజయనగరం పైడితల్లమ్మ సిరిమానోత్సవం● రోడ్డు ప్రమాదంలో మార్షల్ ఆర్ట్స్ విద్యార్థులకు తీవ్ర గాయాలు● ఫాదర్ సందీప్ ఇన్నా రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన మాస్టర్ నాగేశ్వరరావు● రాజాపూర్‌లో పిచ్చికుక్క బీభత్సం.. ఐదుగురికి గాయాలు● రూ.85 లక్షల ఇంటిపై వివాదం.. న్యాయం చేయాలని బాధిత దంపతుల వేడుకోలు● లద్నాపూర్‌లో మినరల్ వాటర్ ప్లాంట్ ప్రారంభించిన మంత్రి శ్రీధర్ బాబు● ప్రజలకు మేలు చేయడమే ప్రజా ప్రభుత్వ లక్ష్యం: మంత్రి శ్రీధర్ బాబు● మార్కెట్ కమిటీ చైర్మన్ వైనాల రాజు కుటుంబాన్ని పరామర్శించిన మంత్రి శ్రీధర్ బాబు● భారీ వర్షంలోనూ వైభవంగా విజయనగరం పైడితల్లమ్మ సిరిమానోత్సవం● రోడ్డు ప్రమాదంలో మార్షల్ ఆర్ట్స్ విద్యార్థులకు తీవ్ర గాయాలు
Home › బ్రేకింగ్ న్యూస్ › సీసీ రోడ్డు పనులను పరిశీలించిన మున్సిపల్ చైర్‌పర్సన్
బ్రేకింగ్ న్యూస్

సీసీ రోడ్డు పనులను పరిశీలించిన మున్సిపల్ చైర్‌పర్సన్

12:22 మధ్యాహ్నం PM

దశలవారీగా దేవరకొండ పట్టణంలోని అన్ని రోడ్లు పూర్తి చేస్తాం

దేవరకొండ, సెప్టెంబర్ 21 (ప్రతినిధి):

దేవరకొండ పట్టణంలో దశలవారీగా ప్రధాన రహదారులతో పాటు అన్ని వార్డుల్లో సీసీ రోడ్ల నిర్మాణ పనులను పూర్తి చేస్తామని మున్సిపల్ చైర్‌పర్సన్ పున్న శైలజ వెంకటేశ్వర్లు అన్నారు.

సోమవారం పట్టణంలోని చేనేత సహకార సంఘం భవనం సమీపంలో జరుగుతున్న సీసీ రోడ్డు పనులను ఆమె పరిశీలించారు. పనుల నాణ్యత, పురోగతిపై మున్సిపల్ ఏఈ రాజును వివరాలు అడిగి తెలుసుకుని, పలు సూచనలు చేశారు.

ఈ సందర్భంగా చైర్‌పర్సన్ మాట్లాడుతూ.. పట్టణాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు చర్యలు చేపడుతున్నామని తెలిపారు. పట్టణ పరిసరాల పరిశుభ్రతకు కూడా అధిక ప్రాధాన్యత ఇస్తున్నామని పేర్కొన్నారు. ప్రజలకు మెరుగైన మౌలిక వసతులు కల్పించేందుకు అవసరమైన పనులను దశలవారీగా చేపడుతున్నామని చెప్పారు.

చేనేత సహకార సంఘం చైర్మన్ చేరుపల్లి బాలరాజు ఆహ్వానం మేరకు చేనేత సహకార సంఘం భవనం ఆవరణ పరిసరాల్లో జరుగుతున్న రోడ్డు పనులను చైర్‌పర్సన్ పరిశీలించారు.

ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ పున్న వెంకటేశ్వర్లు, చేనేత సహకార సంఘం డైరెక్టర్లు, మేనేజర్ తదితరులు పాల్గొన్నారు.

📲 వార్తను షేర్ చేయండి
🟢 WhatsApp🔵 Facebook
👁 Views: 256🔗 Shares: 10👍 Likes: 0
🇮🇳 జాతీయ స్థాయి రిపోర్టర్ నియామకంమీ ప్రాంతం నుంచి AYUSH24 NEWS కోసం వార్తలను అందించండి.
AYUSH24 NEWS Reporter
219 published stories

AYUSH24 NEWS Reporter Network

మీ ప్రాంతం నుంచి వార్తలు అందించాలనుకుంటున్నారా? మా Reporter Networkలో చేరండి.

Become a Reporter →

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

📱 Download App