స్పాట్ రిజిస్ట్రేషన్ అవకాశాన్ని వినియోగించుకోవాలి: మంథని డీఈ వి. ప్రభాకర్
మంథని, అక్టోబర్ 1 (ఆయుష్ 24 న్యూస్): సేవా సేతు అభియాన్ సదస్సులు విద్యుత్ వినియోగదారులకు మంచి అవకాశమని మంథని డీఈ ఆపరేషన్ వి. ప్రభాకర్ అన్నారు. మూడు రోజులపాటు నిర్వహించే శిబిరంలో ఇళ్లపై సౌర విద్యుత్ పలకలు ఏర్పాటు చేసుకునేందుకు వినియోగదారులు స్పాట్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలని సూచించారు.
సదస్సును ప్రారంభించిన అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఎన్పీడీసీఎల్, టీజీ రెడ్కో అధికారులు, బ్యాంకర్లు, వెండర్లు ఒకే వేదికపై అందుబాటులో ఉండటంతో సౌర విద్యుత్ ఏర్పాటుపై ప్రజలు తమ సందేహాలను నివృత్తి చేసుకోవచ్చని తెలిపారు. ముఖ్యంగా పట్టణ ప్రాంతాలు, ఉద్యోగులు నివసించే కాలనీల్లో ఇంటింటికీ వెళ్లి విస్తృత ప్రచారం నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా సుమారు పది స్పాట్ రిజిస్ట్రేషన్లు నమోదయ్యాయి.
కార్యక్రమంలో మంథని మున్సిపల్ చైర్మన్ వోడ్నాల శ్రీనివాస్, వైస్ చైర్మన్ ముస్కుల సహేందర్ రెడ్డి, ఈఆర్సీ సభ్యుడు శశిభూషణ్ కాచే, మార్కెట్ కమిటీ చైర్మన్ కుడుదుల వెంకన్న, పీఏసీఎస్ చైర్మన్ కొత్త శ్రీనివాస్, బుద్ధర్తి బుచ్చయ్య, సహాయ లెక్కల అధికారి, సహాయ ఇంజనీర్, లీడ్ బ్యాంక్ మేనేజర్, వెండర్లు, విద్యుత్ వినియోగదారులు పాల్గొన్నారు.










Leave a Reply