దేవరకొండ: హౌసింగ్ బోర్డులో సుమన్ షోటో ఖాన్ కరాటే అకాడమీ ఆధ్వర్యంలో బతుకమ్మ పండుగ సంబరాలు ఘనంగా నిర్వహించారు. అకాడమీ జాతీయ ప్రధాన కార్యదర్శి, సీనియర్ కరాటే మాస్టర్ బాండవత్ రామకృష్ణ నాయక్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో పలువురు ప్రముఖులు, కరాటే విద్యార్థినీ విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు.
ఈ కార్యక్రమానికి స్థానిక కౌన్సిలర్ నూకల కవిత, కాంగ్రెస్ పార్టీ పట్టణ మాజీ అధ్యక్షులు నూకల వేణుగోపాల్ రెడ్డి, సుమన్ షోటో ఖాన్ కరాటే అకాడమీ జాతీయ అధ్యక్షులు బూడిద సైదులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. వారు బతుకమ్మ సంబరాల్లో పాల్గొని పండుగ విశిష్టతను చాటారు.
ఈ సందర్భంగా బతుకమ్మ వేడుకల్లో ఉత్సాహంగా పాల్గొన్న కరాటే విద్యార్థినీ విద్యార్థులకు ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాల్లో నిలిచిన వారికి బహుమతులుగా చీరలను పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా సీనియర్ కరాటే మాస్టర్ బాండవత్ రామకృష్ణ నాయక్ మాట్లాడుతూ, మన తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక అయిన బతుకమ్మ పండుగను ఘనంగా నిర్వహించడం ఆనందంగా ఉందన్నారు. యువతలో క్రీడా నైపుణ్యాలతో పాటు మన సంస్కృతి, సంప్రదాయాల పట్ల అవగాహన పెంపొందించేలా ఇలాంటి కార్యక్రమాలను ముందుండి నిర్వహించాలని తెలిపారు.
ఈ కార్యక్రమంలో కరాటే మాస్టర్లు బాండవత్ శివ, భారతి, కొండపల్లి క్రాంతి కుమార్, ఎస్.కె. సుభాని, కిషోర్, జానీ, మోహన్, శ్రీకాంత్, ప్రవళిక తదితరులు పాల్గొన్నారు.
Ayush 24 News – The Voice of Truth
హౌసింగ్ బోర్డులో ఘనంగా సుమన్ షోటో ఖాన్ కరాటే అకాడమీ బతుకమ్మ సంబరాలు
దేవరకొండ: హౌసింగ్ బోర్డులో సుమన్ షోటో ఖాన్ కరాటే అకాడమీ ఆధ్వర్యంలో బతుకమ్మ పండుగ సంబరాలు ఘనంగా నిర్వహించారు. అకాడమీ జాతీయ ప్రధాన కార్యదర్శి, సీనియర్ కరాటే మాస్టర్ బాండవత్ రామకృష్ణ నాయక్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో పలువురు ప్రముఖులు, కరాటే విద్యార్థినీ విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు.


AYUSH24 NEWS Reporter Network
మీ ప్రాంతం నుంచి వార్తలు అందించాలనుకుంటున్నారా? మా Reporter Networkలో చేరండి.
Become a Reporter →







Leave a Reply