దేవరకొండ 11వ వార్డు కౌన్సిలర్ ఎస్కే నవీద్
దేవరకొండ, సెప్టెంబర్ 1 | అయుష్ 24 న్యూస్
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు ప్రజల జీవితాల్లో గణనీయమైన మార్పులు తీసుకొచ్చాయని, 1000 రోజుల ప్రజాపాలన రాష్ట్ర అభివృద్ధికి కొత్త దిశను నిర్దేశించిందని దేవరకొండ పట్టణ 11వ వార్డు కౌన్సిలర్ ఎస్కే నవీద్ అన్నారు. ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి నాయకత్వంలో అన్ని వర్గాల ప్రజలకు సంక్షేమ ఫలాలు చేరేలా ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తోందని పేర్కొన్నారు.
ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి నాయకత్వంలో మహిళలు, రైతులు, యువత, విద్యార్థులు, పేదలు, బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనార్టీల సంక్షేమానికి ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేపడుతోందన్నారు.
మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం, రైతులకు రుణమాఫీ, రైతు భరోసా, పంటల కొనుగోలు, పేదలకు ఇందిరమ్మ ఇళ్లు, యువతకు ఉద్యోగాలు, ఉపాధి అవకాశాలు, గృహజ్యోతి వంటి పథకాలు ప్రజలకు ఉపయోగపడుతున్నాయని తెలిపారు.
సామాజిక న్యాయం, సమాన అవకాశాలే ప్రభుత్వ లక్ష్యమని, ప్రజల సమస్యల పరిష్కారం, వార్డు అభివృద్ధికి తాను నిరంతరం కృషి చేస్తానని నవీద్ పేర్కొన్నారు.
“1000 రోజుల ప్రజాపాలన ప్రతి ఇంటికి సంక్షేమం, ప్రతి కుటుంబానికి భరోసా, ప్రతి యువకుడికి కొత్త అవకాశానికి ప్రతీక” అని ఆయన అన్నారు.



Mahamood Mohammed





Leave a Reply