లబ్ధిదారులకు స్మార్ట్ రేషన్ కార్డులు అందజేసిన ఎమ్మెల్యే డాక్టర్ టి. రామ్మోహన్ రెడ్డి
పరిగి: సెప్టెంబర్ 29 (AYUSH24 News ప్రతినిధి)
పరిగి పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పరిగి ఎమ్మెల్యే, టీపీసీసీ ట్రైనింగ్ కమిటీ చైర్మన్ డాక్టర్ టి. రామ్మోహన్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా అర్హులైన 152 మంది లబ్ధిదారులకు ఒక్కొక్కరికి రూ.1,00,116 చొప్పున మొత్తం రూ.1,52,17,632 విలువైన కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను ప్రజాప్రతినిధులు, అధికారులతో కలిసి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి పంపిణీ చేశారు.
అదేవిధంగా అర్హులైన లబ్ధిదారులకు స్మార్ట్ రేషన్ కార్డులను కూడా ఎమ్మెల్యే అందజేశారు.
అయుష్ 24 న్యూస్ — The Voice of Truth










Leave a Reply