ఆదరణీయ భారత ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి జన్మదినాన్ని పురస్కరించుకుని, పూడూరు మండలం చంగోముల్ గ్రామంలోని హనుమాన్ దేవాలయంలో బీజేపీ పరిగి అసెంబ్లీ ఇంచార్జ్ శ్రీ మారుతి కిరణ్ బూనేటి గారు పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి దీపాలను వెలిగించి జన్మదిన వేడుకలు నిర్వహించారు.
ఈ సందర్భంగా శ్రీ మారుతి కిరణ్ బూనేటి గారు మాట్లాడుతూ, ప్రజల సంక్షేమం, దేశ అభివృద్ధి కోసం ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారు అందిస్తున్న సేవలను కొనియాడారు. దేశాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లేందుకు మోదీ గారి నాయకత్వంలో చేపడుతున్న వివిధ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రస్తావించారు.
ఈ సందర్భంగా ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారికి ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలతో కూడిన దీర్ఘాయుష్షు కలగాలని, దేశ ప్రజల సేవలో మరింత కాలం కొనసాగాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో బీజేపీ సీనియర్ నాయకులు మల్లేష్ పటేల్ గారు, పూడూరు మండల అధ్యక్షులు రాఘవేందర్ గారు, దోమ మండల మాజీ అధ్యక్షులు శేరి రాంరెడ్డి గారు, నస్కల్ గ్రామ మాజీ సర్పంచ్ శ్రీనివాస్ గారు, బీజేపీ వికారాబాద్ జిల్లా ధార్మిక సెల్ జాయింట్ కన్వీనర్ జాక సురేష్ బాబు గారు, బీజేపీ నాయకులు కంకల్ రవీందర్ గారు, రాజు గారు, ప్రకాష్ యాదవ్ గారు, మంచంపల్లి నర్సింలు గారు, శ్రీశైలం గారు, రాజేష్ గౌడ్ గారు, అజయ్ గుప్తా గారు తదితరులు పాల్గొన్నారు.










Leave a Reply