శ్రీ గణపతి నవరాత్రి ఉత్సవాల్లో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే పుట్ట మధూకర్
మంథని, సెప్టెంబర్ 18 (ప్రతినిధి): మంథని పట్టణంలోని రెడ్డి సంక్షేమ సంఘం భవన్లో రెడ్డి సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న శ్రీ గణపతి నవరాత్రి ఉత్సవాల్లో మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధూకర్ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా శ్రీ విఘ్నేశ్వర స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం పుట్ట మధూకర్ను రెడ్డి సంక్షేమ సంఘం ప్రతినిధులు శాలువాతో ఘనంగా సన్మానించారు.
ఈ కార్యక్రమంలో రెడ్డి సంక్షేమ సంఘం నాయకులు, సభ్యులు, భక్తులు తదితరులు పాల్గొన్నారు.









Leave a Reply