Sunday, 13 Sep 2026
13 Sep 2026Sunday
Home   Reporter Profile
🔴 BREAKING
వర్షాల కోసం అల్లాహ్‌ను వేడుకున్న ముస్లిం సోదరులు మత సామరస్యానికి ప్రతీకగా డాక్టర్ యుగంధర్ పొన్న ప్రమాదంలో మృతి చెందిన భాస్కర్ కుటుంబానికి కాంగ్రెస్ నాయకుడు మోహన్ నాయక్ పరామర్శ కూటమి ప్రభుత్వ హయాంలో జర్నలిస్టుల సమస్యలకు పరిష్కారం పదవి లేకున్నా ఇంత సేవా సంకల్పమా?! వినాయక చవితి సందర్భంగా దేవరకొండ నియోజకవర్గ ప్రజలకు, యువతకు శుభాకాంక్షలు 🕉️ దేవరకొండలో వినాయక చవితి సందడి కృష్ణమూర్తిని ఆదర్శంగా తీసుకోవాలి వర్షాల కోసం అల్లాహ్‌ను వేడుకున్న ముస్లిం సోదరులు మత సామరస్యానికి ప్రతీకగా డాక్టర్ యుగంధర్ పొన్న ప్రమాదంలో మృతి చెందిన భాస్కర్ కుటుంబానికి కాంగ్రెస్ నాయకుడు మోహన్ నాయక్ పరామర్శ కూటమి ప్రభుత్వ హయాంలో జర్నలిస్టుల సమస్యలకు పరిష్కారం పదవి లేకున్నా ఇంత సేవా సంకల్పమా?! వినాయక చవితి సందర్భంగా దేవరకొండ నియోజకవర్గ ప్రజలకు, యువతకు శుభాకాంక్షలు 🕉️ దేవరకొండలో వినాయక చవితి సందడి కృష్ణమూర్తిని ఆదర్శంగా తీసుకోవాలి
Home › Devarakonda › దేవరకొండలో బొడ్రాయి పండుగ నిర్వహించాలని పట్టణ ప్రజల విజ్ఞప్తి
Devarakonda

దేవరకొండలో బొడ్రాయి పండుగ నిర్వహించాలని పట్టణ ప్రజల విజ్ఞప్తి

05:58 తెల్లవారుజాము AM

బొడ్రాయి పునఃప్రతిష్ఠకు యాదవ సంఘం ఆధ్వర్యంలో మున్సిపల్ చైర్‌పర్సన్‌కు వినతిపత్రం

దేవరకొండ, ఆగస్టు 20, అయుష్ 24 న్యూస్: దేవరకొండ పట్టణంలోని పాత పోలీస్ స్టేషన్ సమీపంలో ఉన్న బొడ్రాయిని పునఃప్రతిష్ఠించి బొడ్రాయి పండుగ నిర్వహించాలని కోరుతూ దేవరకొండ పట్టణ యాదవ సంఘం ఆధ్వర్యంలో గురువారం మున్సిపల్ చైర్‌పర్సన్ పున్న శైలజ వెంకటేశ్వర్లకు వినతిపత్రం అందజేశారు.

ఈ సందర్భంగా యాదవ సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు నేతాల వెంకటేష్ యాదవ్ మాట్లాడుతూ.. తరతరాలుగా దేవరకొండ పట్టణ ప్రజలకు బొడ్రాయి సంప్రదాయంగా ఆధ్యాత్మిక విశ్వాసానికి ప్రతీకగా ఉందని తెలిపారు. ప్రజలు సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో, ధనధాన్యాలతో వర్ధిల్లాలని కోరుతూ గతంలో బొడ్రాయికి పూజలు నిర్వహించేవారని పేర్కొన్నారు.

ప్రస్తుతం బొడ్రాయి నిరాదరణకు గురై భూమిలోకి కూరుకుపోయిందని, దానిని తిరిగి పునఃప్రతిష్ఠించి బొడ్రాయి పండుగను ఘనంగా నిర్వహించేందుకు యాదవ సంఘం ముందుకు వచ్చిందని తెలిపారు.

అన్ని వర్గాలతో కమిటీ ఏర్పాటు చేయాలి

బొడ్రాయి పునఃప్రతిష్ఠ, పండుగ నిర్వహణ కోసం దేవరకొండ పట్టణంలోని అన్ని కులాలు, వర్గాల ప్రజలను కలుపుకుని ఒక కమిటీ ఏర్పాటు చేయాలని యాదవ సంఘం నాయకులు కోరారు. పట్టణ ప్రజలందరూ ఐక్యంగా ముందుకు వచ్చి బొడ్రాయి పండుగను నిర్వహించాలని విజ్ఞప్తి చేశారు.

కరువు కాటకాలు తొలగిపోయి పంటలు సమృద్ధిగా పండాలని, ప్రజలందరూ సుఖసంతోషాలతో జీవించాలని కోరుతూ బొడ్రాయిని ప్రతిష్ఠించి పూజలు నిర్వహించే సంప్రదాయం అనాదిగా కొనసాగుతోందని వారు తెలిపారు.

దేవరకొండలో కూడా బొడ్రాయి పండుగ నిర్వహణపై గతంలో పలుమార్లు చర్చలు జరిగినప్పటికీ కార్యరూపం దాల్చలేదని, ప్రస్తుతం యాదవ సంఘం ముందుకు రావడం శుభపరిణామమని పేర్కొన్నారు. ఇదే స్ఫూర్తితో పట్టణంలోని అన్ని వర్గాల ప్రజలు ఒకే తాటిపైకి వచ్చి బొడ్రాయి పునఃప్రతిష్ఠ కార్యక్రమాన్ని నిర్వహించాలని పట్టణ ప్రజలు కోరుతున్నారు.

అయుష్ 24 న్యూస్ – ది వాయిస్ ఆఫ్ ట్రూత్

📲 వార్తను షేర్ చేయండి
🟢 WhatsApp🔵 Facebook
👁 Views: 0🔗 Shares: 0👍 Likes: 0
🇮🇳 జాతీయ స్థాయి రిపోర్టర్ నియామకంమీ ప్రాంతం నుంచి AYUSH24 NEWS కోసం వార్తలను అందించండి.
AYUSH24 NEWS Reporter
721 published stories

AYUSH24 NEWS Reporter Network

మీ ప్రాంతం నుంచి వార్తలు అందించాలనుకుంటున్నారా? మా Reporter Networkలో చేరండి.

Become a Reporter →

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *