గిరిజన సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబించేలా తీజ్ సంబరాలు నిర్వహించాలి: కేతావత్ భీల్యా నాయక్
దేవరకొండ, ఆగస్టు 21 — అయుష్ 24 న్యూస్:
గిరిజనుల సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబించేలా తీజ్ పండుగను వైభవంగా నిర్వహించుకోవాలని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు కేతావత్ భీల్యా నాయక్ అన్నారు. తీజ్ ఉత్సవాల నిర్వహణ కోసం తనవంతుగా రూ.30,000 ఆర్థిక విరాళాన్ని అందజేశారు.
ఈ సందర్భంగా కేతావత్ భీల్యా నాయక్ మాట్లాడుతూ ఆడబిడ్డలు సంప్రదాయబద్ధంగా జరుపుకునే తీజ్ పండుగ గిరిజన సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలుస్తుందని అన్నారు. తీజ్ వేడుకలను ఘనంగా నిర్వహించి గిరిజన సంస్కృతి, సంప్రదాయాలను చాటాలని కోరారు.
రామ్ రామ్ బంజారా సేవా సంఘ్ ఆధ్వర్యంలో యువత ఇలాంటి సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించేందుకు ముందుకు రావడం అభినందనీయమని అన్నారు. నేటి సమాజంలో యువత పాత్ర ఎంతో కీలకమని, గిరిజన యువతీ యువకుల కోసం విద్య, వైద్యం, ఆరోగ్యం తదితర అంశాలపై మరిన్ని సామాజిక కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు.
“ఆత్మవిశ్వాసం, సంకల్పం మనవైతే విజయం మనకు బానిస అవుతుంది” అనే స్ఫూర్తితో ప్రతి యువతీ యువకుడు ముందుకు సాగాలని కేతావత్ భీల్యా నాయక్ పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో ఉత్సవ కమిటీ సభ్యులు రమావత్ వంశీ, నేనావత్ జాను, కొర్ర శ్రీధర్, ప్రకాష్, మాకట్లాల్, కిరణ్ తదితరులు పాల్గొన్నారు.
— అయుష్ 24 న్యూస్










Leave a Reply