వినాయక ఫంక్షన్ హాల్‌లో సమావేశం.. వెల్కమ్ బోర్డు నుంచి మోటార్ సైకిల్ ర్యాలీ
మెదక్, ఆగస్టు 23, అయుష్ 24 న్యూస్: మెదక్ పట్టణంలోని వినాయక ఫంక్షన్ హాల్‌లో ఈ నెల 24వ తేదీ సోమవారం ఉదయం 11 గంటలకు కాంగ్రెస్ పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ (PAC) ఉమ్మడి మెదక్ జిల్లా సమావేశం నిర్వహించనున్నట్లు మెదక్ పట్టణ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు మందుగుల గంగాధర్ తెలిపారు.
ఈ సమావేశానికి పీసీసీ అధ్యక్షులు శ్రీ మహేష్ కుమార్ గౌడ్, ఆరోగ్యశాఖ మంత్రి శ్రీ దామోదర్ రాజనర్సింహ, జిల్లా ఇన్‌చార్జి మంత్రి శ్రీ వివేక్ వెంకటస్వామి, మెదక్ ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి రోహిత్, పార్లమెంట్ సభ్యులు శ్రీ సురేష్ షెట్కర్, ఎమ్మెల్యే పి. సంజీవరెడ్డి, జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శ్రీ ఆంజనేయులు గౌడ్ తదితరులు పాల్గొననున్నట్లు తెలిపారు.
వెల్కమ్ బోర్డు నుంచి మోటార్ సైకిల్ ర్యాలీ
సమావేశానికి ముందు మెదక్ పట్టణంలోని నర్సాపూర్ రోడ్ వెల్కమ్ బోర్డు నుంచి వినాయక ఫంక్షన్ హాల్ వరకు మోటార్ సైకిల్ ర్యాలీ నిర్వహించనున్నట్లు వెల్లడించారు.
ఈ ర్యాలీ, సమావేశానికి మున్సిపల్ చైర్‌పర్సన్, వైస్ చైర్మన్, కౌన్సిలర్లు, మాజీ వైస్ చైర్మన్, మాజీ కౌన్సిలర్లు, కోఆప్షన్ సభ్యులు, యువజన కాంగ్రెస్, మహిళా కాంగ్రెస్‌తో పాటు అన్ని అనుబంధ సంఘాల నాయకులు, కార్యకర్తలు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు పెద్ద సంఖ్యలో హాజరు కావాలని మందుగుల గంగాధర్ కోరారు.
అలాగే ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా పాత్రికేయ మిత్రులు కూడా కార్యక్రమానికి హాజరై సమావేశాన్ని కవర్ చేయాలని విజ్ఞప్తి చేశారు.
ఇట్లు
మందుగుల గంగాధర్
అధ్యక్షులు, మెదక్ పట్టణ కాంగ్రెస్ కమిటీ
— అయుష్ 24 న్యూస్










Leave a Reply