కాబోయే నూతన వధూవరులను ఆశీర్వదించిన ఎమ్మెల్యే నేనావత్ బాలు నాయక్
హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ నేత, సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే తూర్పు జయప్రకాశ్ రెడ్డి (జగ్గారెడ్డి) గారి కుమారుడు భరత్ సాయి రెడ్డి–పాలక్ పటేల్ నిశ్చితార్థ వేడుకలో దేవరకొండ ఎమ్మెల్యే శ్రీ నేనావత్ బాలు నాయక్ గారు పాల్గొని కాబోయే నూతన వధూవరులను ఆశీర్వదించారు.
హైదరాబాద్‌లోని ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్‌లో ఉన్న ఈవెంటరాలో సోమవారం సాయంత్రం నిర్వహించిన నిశ్చితార్థ వేడుకకు మాజీ సీఎల్పీ నేత, సీనియర్ నాయకులు శ్రీ కుందూరు జానారెడ్డి గారు, తెలంగాణ శాసనమండలి చైర్మన్ శ్రీ గుత్తా సుఖేందర్ రెడ్డి గారు, డెయిరీ చైర్మన్ శ్రీ గుత్తా అమిత్ రెడ్డి గారు తదితరులతో కలిసి ఎమ్మెల్యే బాలు నాయక్ గారు హాజరయ్యారు.
ఈ సందర్భంగా కాబోయే నూతన వధూవరులు భరత్ సాయి రెడ్డి–పాలక్ పటేల్‌ను ఎమ్మెల్యే బాలు నాయక్ గారు ఆత్మీయంగా ఆశీర్వదించారు. వారి వైవాహిక జీవితం సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో, ఆనందంగా సాగాలని ఆకాంక్షించారు.
అనంతరం కుటుంబ సభ్యులతో ఎమ్మెల్యే బాలు నాయక్ గారు ఆత్మీయంగా ముచ్చటించారు. ఈ శుభకార్యానికి హాజరై నూతన జంటను ఆశీర్వదించడం ఎంతో ఆనందంగా ఉందని ఆయన తెలిపారు.
ఈ కార్యక్రమంలో పలువురు ప్రజాప్రతినిధులు, రాజకీయ ప్రముఖులు, కుటుంబ సభ్యులు, ఆత్మీయులు పాల్గొని కాబోయే నూతన వధూవరులకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు.
అయుష్ 24 న్యూస్



Mahamood Mohammed






Leave a Reply