మంత్రి సీతక్క ఆదేశాల మేరకు మరో 15 రోజులు గడువు పెంపు
హైదరాబాద్: చేయూత పెన్షన్ కోసం దరఖాస్తు చేసుకునే వారికి తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దరఖాస్తుల గడువును మరో 15 రోజులపాటు పొడిగిస్తూ సెప్టెంబర్ 15, 2026 వరకు అవకాశం కల్పించింది.
మంత్రి సీతక్క ఆదేశాల మేరకు ఈ గడువు పొడిగించినట్లు సమాచారం. సర్వర్ ప్రక్రియలో ఎదురైన సమస్యలు, దివ్యాంగుల నుంచి వచ్చిన విజ్ఞప్తులను పరిగణనలోకి తీసుకుని దరఖాస్తుల గడువును పొడిగించినట్లు అధికారులు తెలిపారు.
గడువు పొడిగింపుతో ఇప్పటివరకు దరఖాస్తు చేసుకోలేకపోయిన అర్హులకు మరో అవకాశం లభించనుంది. అర్హులైన వారు సెప్టెంబర్ 15లోగా దరఖాస్తు చేసుకోవాలని అధికారులు సూచించారు.
అయుష్ 24 న్యూస్










Leave a Reply