అయుష్ 24 న్యూస్ | బాలాపూర్
బాలాపూర్‌లోని విజయ దుర్గ కాలనీ, ఆర్సీఐ రోడ్, శివాజీ చౌక్‌లో నాయక్ బుడోకాన్ కరాటే అకాడమీ (బుడోకాన్ కరాటే-డో ఇంటర్నేషనల్ అనుబంధ సంస్థ) ఆధ్వర్యంలో కలర్ బెల్ట్ గ్రేడింగ్ పరీక్షను విజయవంతంగా నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జి. తిరుపతి, ఎస్ఐ ఆఫ్ పోలీస్, ఇంటెలిజెన్స్, హైదరాబాద్ హాజరై విద్యార్థులను అభినందించారు. అతిథిగా ఆర్. కన్నన్ పాల్గొన్నారు.
కార్యక్రమానికి ఎన్బీకేఏ అధ్యక్షుడు పి. గణేష్ నాయక్ అధ్యక్షత వహించగా, కోచ్ వి. సుమన్ నాయక్ ఆధ్వర్యంలో పరీక్ష నిర్వహించారు. అనూష్ కూడా కార్యక్రమంలో పాల్గొన్నారు.

గ్రేడింగ్ పరీక్షలో విజయవంతమైన విద్యార్థులందరికీ బెల్టులు, సర్టిఫికెట్లను అందజేశారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథి జి. తిరుపతి మాట్లాడుతూ.. విద్యార్థులు ఇదే స్ఫూర్తితో కష్టపడి మరింత ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు.
“మీ అందరినీ ఈ స్థాయిలో చూడటం ఎంతో సంతోషంగా ఉంది. కష్టపడి పనిచేస్తూ మరిన్ని విజయాలు సాధించాలి” అని విద్యార్థులను ప్రోత్సహించారు.
కలర్ బెల్ట్ గ్రేడింగ్ పరీక్షలో ప్రతిభ కనబరిచి విజయవంతమైన విద్యార్థులందరినీ నాయక్ బుడోకాన్ కరాటే అకాడమీ నిర్వాహకులు అభినందించారు.










Leave a Reply