రూ.31.80 లక్షల విలువైన రుణ చెక్కులు అందజేత
మంథని | అయుష్ 24 న్యూస్
రైతుల వ్యవసాయ అవసరాల కోసం ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ద్వారా కర్షక మిత్ర రుణాలు మంజూరు చేసినట్లు మంథని సింగిల్ విండో చైర్మన్ కొత్త శ్రీనివాస్ తెలిపారు.
స్థానిక సంఘ కార్యాలయంలో రుణాలు మంజూరైన రైతులకు చైర్మన్ కొత్త శ్రీనివాస్, సంఘ కార్యదర్శి బొద్దుల సమ్మయ్యతో కలిసి రూ.31.80 లక్షల విలువైన రుణ చెక్కులను అందజేశారు.
ఈ సందర్భంగా కొత్త శ్రీనివాస్ మాట్లాడుతూ.. రైతులకు వ్యవసాయ పనుల కోసం ఆర్థిక సహకారం అందించడమే సహకార సంఘం ప్రధాన లక్ష్యమన్నారు. రైతులు రుణాలను సద్వినియోగం చేసుకొని వ్యవసాయంలో అభివృద్ధి సాధించాలని సూచించారు. రైతుల సంక్షేమం కోసం మరిన్ని రుణ సదుపాయాలు కల్పించేందుకు కృషి చేస్తామని తెలిపారు.
పర్షవేన సంతోష్‌కు రూ.7.80 లక్షలు, మీసాల రవి, పర్షవేన బాలరాజు, నాగుల జగన్, అనవేన రాజేశ్వరిలకు రూ.6 లక్షల చొప్పున రుణాలు మంజూరయ్యాయి.

కార్యక్రమంలో సహకార సంఘం పాలకవర్గ సభ్యులు, సిబ్బంది, రైతులు, రుణ లబ్ధిదారులు పాల్గొన్నారు.










Leave a Reply