అయుష్ 24 న్యూస్
తెలంగాణలో మహిళలు, బాలికలపై చోటుచేసుకుంటున్న హత్యలు, దాడుల ఘటనలపై తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. సౌజన్య, నర్సు శిరీష ఘటనలతో పాటు ఖమ్మంలో పదేళ్ల బాలికను మూడంతస్తుల భవనం నుంచి కింద పడేసిన ఘటనలు ప్రజల్లో భయాందోళన కలిగిస్తున్నాయి.
ఇలాంటి ఘటనలకు పాల్పడుతున్న నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని, మహిళలు మరియు బాలికలకు పూర్తి భద్రత కల్పించాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు. నేరాలకు మతం లేదా వర్గంతో సంబంధం లేకుండా, బాధ్యులపై చట్టప్రకారం కఠినంగా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
మహిళలు, బాలికల భద్రత విషయంలో ప్రభుత్వం, పోలీసులు మరింత అప్రమత్తంగా వ్యవహరించాలని ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు.










Leave a Reply