దేవరకొండ, సెప్టెంబర్ 1 (Ayush 24 News): దేవరకొండ మండలం ఇద్దంపల్లి గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకుడు మల్రెడ్డి రవీందర్ రెడ్డి మాతృమూర్తి సుగుణమ్మ మృతి చెందిన విషయం తెలుసుకున్న దేవరకొండ ఎమ్మెల్యే నేనావత్ బాలు నాయక్ వారి నివాసానికి వెళ్లి ఆమె భౌతికకాయానికి పూలమాల వేసి నివాళులర్పించారు.
ఈ సందర్భంగా సుగుణమ్మ మృతిపట్ల ఎమ్మెల్యే బాలు నాయక్ తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. అనంతరం మల్రెడ్డి రవీందర్ రెడ్డి, కుటుంబ సభ్యులను పరామర్శించి వారికి తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు.
ఈ కష్ట సమయంలో కుటుంబ సభ్యులు ధైర్యంగా ఉండాలని, వారికి మనోధైర్యం కలగాలని ఎమ్మెల్యే బాలు నాయక్ ఆకాంక్షించారు. సుగుణమ్మ ఆత్మకు శాంతి చేకూరాలని, కుటుంబ సభ్యులకు ఆ భగవంతుడు మనోధైర్యాన్ని ప్రసాదించాలని ప్రార్థించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షుడు ముక్కమల్ల వెంకటయ్య గౌడ్, మండల కాంగ్రెస్ అధ్యక్షుడు మారుపాకుల సురేష్ గౌడ్, చందంపేట మాజీ ఎంపీపీ ఏడుపుల గోవిందు యాదవ్, నియోజకవర్గ యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు కిన్నెర హరికృష్ణ, స్థానిక సర్పంచ్ పేర్ల సతీష్, పందుల వెంకటయ్య, గ్రామ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, గ్రామస్థులు తదితరులు పాల్గొన్నారు.
– Ayush 24 News
మల్రెడ్డి రవీందర్ రెడ్డి మాతృమూర్తి సుగుణమ్మ మృతికి ఎమ్మెల్యే బాలు నాయక్ సంతాపం
దేవరకొండ, సెప్టెంబర్ 1 (Ayush 24 News): దేవరకొండ మండలం ఇద్దంపల్లి గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకుడు మల్రెడ్డి రవీందర్ రెడ్డి మాతృమూర్తి సుగుణమ్మ మృతి చెందిన విషయం తెలుసుకున్న దేవరకొండ ఎమ్మెల్యే శ్రీ నేనావత్ బాలు నాయక్ వారి నివాసానికి వెళ్లి ఆమె భౌతికకాయానికి పూలమాల
01సెప్టెంబర్2026
05:40 సాయంత్రం PM
🇮🇳 జాతీయ స్థాయి రిపోర్టర్ నియామకంమీ ప్రాంతం నుంచి AYUSH24 NEWS కోసం వార్తలను అందించండి.

AYUSH24 NEWS Reporter Network
మీ ప్రాంతం నుంచి వార్తలు అందించాలనుకుంటున్నారా? మా Reporter Networkలో చేరండి.
Become a Reporter →
Mahamood Mohammed






Leave a Reply