Monday, 14 Sep 2026
14 Sep 2026Monday
Home   Reporter Profile
🔴 BREAKING
వర్షాల కోసం అల్లాహ్‌ను వేడుకున్న ముస్లిం సోదరులు మత సామరస్యానికి ప్రతీకగా డాక్టర్ యుగంధర్ పొన్న ప్రమాదంలో మృతి చెందిన భాస్కర్ కుటుంబానికి కాంగ్రెస్ నాయకుడు మోహన్ నాయక్ పరామర్శ కూటమి ప్రభుత్వ హయాంలో జర్నలిస్టుల సమస్యలకు పరిష్కారం పదవి లేకున్నా ఇంత సేవా సంకల్పమా?! వినాయక చవితి సందర్భంగా దేవరకొండ నియోజకవర్గ ప్రజలకు, యువతకు శుభాకాంక్షలు 🕉️ దేవరకొండలో వినాయక చవితి సందడి కృష్ణమూర్తిని ఆదర్శంగా తీసుకోవాలి వర్షాల కోసం అల్లాహ్‌ను వేడుకున్న ముస్లిం సోదరులు మత సామరస్యానికి ప్రతీకగా డాక్టర్ యుగంధర్ పొన్న ప్రమాదంలో మృతి చెందిన భాస్కర్ కుటుంబానికి కాంగ్రెస్ నాయకుడు మోహన్ నాయక్ పరామర్శ కూటమి ప్రభుత్వ హయాంలో జర్నలిస్టుల సమస్యలకు పరిష్కారం పదవి లేకున్నా ఇంత సేవా సంకల్పమా?! వినాయక చవితి సందర్భంగా దేవరకొండ నియోజకవర్గ ప్రజలకు, యువతకు శుభాకాంక్షలు 🕉️ దేవరకొండలో వినాయక చవితి సందడి కృష్ణమూర్తిని ఆదర్శంగా తీసుకోవాలి
Home › బ్రేకింగ్ న్యూస్ › ఫకీర్‌పురంలో మహానేత వైఎస్సార్‌కు ఘన నివాళులు.. 17వ వర్ధంతి సందర్భంగా పూలమాలలతో స్మరణ
బ్రేకింగ్ న్యూస్

ఫకీర్‌పురంలో మహానేత వైఎస్సార్‌కు ఘన నివాళులు.. 17వ వర్ధంతి సందర్భంగా పూలమాలలతో స్మరణ

నాంపల్లి: దివంగత ముఖ్యమంత్రి, మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి 17వ వర్ధంతి సందర్భంగా నాంపల్లి మండలం ఫకీర్‌పురం గ్రామంలో ఘనంగా నివాళులు అర్పించారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు ముదిగొండ శ్రీకాంత్ ఆధ్వర్యంలో వైఎస్సార్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ముదిగొండ శ్రీకాంత్

07:11 ఉదయం AM

నాంపల్లి: దివంగత ముఖ్యమంత్రి, మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి 17వ వర్ధంతి సందర్భంగా నాంపల్లి మండలం ఫకీర్‌పురం గ్రామంలో ఘనంగా నివాళులు అర్పించారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు ముదిగొండ శ్రీకాంత్ ఆధ్వర్యంలో వైఎస్సార్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.
ఈ సందర్భంగా ముదిగొండ శ్రీకాంత్ మాట్లాడుతూ, ఆరోగ్యశ్రీ, ఫీజు రీయింబర్స్‌మెంట్, జలయజ్ఞం వంటి అనేక సంక్షేమ పథకాల ద్వారా పేద ప్రజల జీవితాల్లో వెలుగులు నింపిన మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి అని అన్నారు. పేదల సంక్షేమం, రైతుల అభ్యున్నతి కోసం ఆయన చేసిన సేవలు చిరస్మరణీయమని పేర్కొన్నారు.
ప్రజల సంక్షేమమే ధ్యేయంగా పనిచేసిన వైఎస్సార్, పేద ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన ప్రజానాయకుడని ముదిగొండ శ్రీకాంత్ కొనియాడారు. ఆయన ఆశయాలు, సంక్షేమ పాలన నేటికీ ప్రజలకు ఆదర్శంగా నిలుస్తున్నాయని తెలిపారు.
ఈ కార్యక్రమంలో వైఎస్సార్ అభిమానులు మారం వెంకట్ రెడ్డి, పగిల్ల వెంకటయ్య, రమేష్, కల్లల లోహిత్ రెడ్డి, రవీందర్ రెడ్డి, నరేందర్ రెడ్డి, యాదగిరి రెడ్డి, కృష్ణారెడ్డి, వినోద్, యాదగిరి, ఈదమ్మ, బాలమ్మ, గోపమ్మ, లాలయ, గ్రామ పెద్దలు, వైఎస్సార్ అభిమానులు తదితరులు పాల్గొన్నారు.
— Ayush 24 News

📲 వార్తను షేర్ చేయండి
🟢 WhatsApp🔵 Facebook
👁 Views: 15🔗 Shares: 1👍 Likes: 0
🇮🇳 జాతీయ స్థాయి రిపోర్టర్ నియామకంమీ ప్రాంతం నుంచి AYUSH24 NEWS కోసం వార్తలను అందించండి.
AYUSH24 NEWS Reporter
42 published stories

AYUSH24 NEWS Reporter Network

మీ ప్రాంతం నుంచి వార్తలు అందించాలనుకుంటున్నారా? మా Reporter Networkలో చేరండి.

Become a Reporter →

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *