అధ్యక్ష, కార్యదర్శులుగా ప్రశాంత్, మణికంఠ
చేవెళ్ల, సెప్టెంబర్ 2, అయుష్ 24 న్యూస్:
చేవెళ్ల డివిజన్లో ఆల్ ఇండియా స్టూడెంట్స్ అసోసియేషన్ (ఏఐఎస్ఏ) నూతన కమిటీని బుధవారం ఎన్నుకున్నారు. రంగారెడ్డి జిల్లా ఏఐఎస్ఏ కన్వీనర్ చరణ్ గౌడ్, కో-కన్వీనర్ రేశ్వంత్ ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో నూతన కమిటీని ఏర్పాటు చేశారు.
ఈ సందర్భంగా జిల్లా కన్వీనర్ చరణ్ గౌడ్ మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా విద్యార్థులు ఎదుర్కొంటున్న విద్యారంగ సమస్యల పరిష్కారానికి ఏఐఎస్ఏ నిరంతరం పోరాడుతోందన్నారు. చేవెళ్ల డివిజన్లో కూడా విద్యార్థుల సమస్యలపై బలమైన గళం వినిపిస్తూ, వాటి పరిష్కారానికి కృషి చేయాలని నూతన కమిటీకి సూచించారు.
నూతన డివిజన్ కమిటీ అధ్యక్షుడిగా ప్రశాంత్, కార్యదర్శిగా మణికంఠ ఎన్నికయ్యారు. ఉపాధ్యక్షులుగా వినయ్, మణి, సహాయ కార్యదర్శులుగా మధు, రోహిత్ ఎన్నికయ్యారు.

కమిటీ సభ్యులుగా అశోక్, జనార్ధన్, శ్రీశైలం, ప్రకాష్, శివ, ధనుష్, నవీన్, నరేష్, హరి ప్రసాద్, నవీన్ తదితరులు ఎన్నికయ్యారు.
నూతనంగా ఎన్నికైన కమిటీ సభ్యులు విద్యార్థుల సమస్యలను గుర్తించి, వారి హక్కుల కోసం సంఘటితంగా పనిచేస్తామని తెలిపారు.










Leave a Reply