Sunday, 13 Sep 2026
13 Sep 2026Sunday
Home   Reporter Profile
🔴 BREAKING
వర్షాల కోసం అల్లాహ్‌ను వేడుకున్న ముస్లిం సోదరులు మత సామరస్యానికి ప్రతీకగా డాక్టర్ యుగంధర్ పొన్న ప్రమాదంలో మృతి చెందిన భాస్కర్ కుటుంబానికి కాంగ్రెస్ నాయకుడు మోహన్ నాయక్ పరామర్శ కూటమి ప్రభుత్వ హయాంలో జర్నలిస్టుల సమస్యలకు పరిష్కారం పదవి లేకున్నా ఇంత సేవా సంకల్పమా?! వినాయక చవితి సందర్భంగా దేవరకొండ నియోజకవర్గ ప్రజలకు, యువతకు శుభాకాంక్షలు 🕉️ దేవరకొండలో వినాయక చవితి సందడి కృష్ణమూర్తిని ఆదర్శంగా తీసుకోవాలి వర్షాల కోసం అల్లాహ్‌ను వేడుకున్న ముస్లిం సోదరులు మత సామరస్యానికి ప్రతీకగా డాక్టర్ యుగంధర్ పొన్న ప్రమాదంలో మృతి చెందిన భాస్కర్ కుటుంబానికి కాంగ్రెస్ నాయకుడు మోహన్ నాయక్ పరామర్శ కూటమి ప్రభుత్వ హయాంలో జర్నలిస్టుల సమస్యలకు పరిష్కారం పదవి లేకున్నా ఇంత సేవా సంకల్పమా?! వినాయక చవితి సందర్భంగా దేవరకొండ నియోజకవర్గ ప్రజలకు, యువతకు శుభాకాంక్షలు 🕉️ దేవరకొండలో వినాయక చవితి సందడి కృష్ణమూర్తిని ఆదర్శంగా తీసుకోవాలి
Home › బ్రేకింగ్ న్యూస్ › 420 హామీలు – ఆరు గ్యారెంటీల అమలుపై బీఆర్‌ఎస్ నిరసన
బ్రేకింగ్ న్యూస్

420 హామీలు – ఆరు గ్యారెంటీల అమలుపై బీఆర్‌ఎస్ నిరసన

04:14 సాయంత్రం PM
  • మంథనిలో ఫ్లెక్సీలు, బాకీ కార్డులతో ఆందోళన.. మాజీ ఎమ్మెల్యే పుట్ట మధూకర్ విమర్శలు
మంథని, సెప్టెంబర్ 2 (అయుష్ 24 న్యూస్): కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి వెయ్యి రోజులు పూర్తయినా ఎన్నికల సమయంలో ఇచ్చిన 420 హామీలు, ఆరు గ్యారెంటీలను అమలు చేయలేదని ఆరోపిస్తూ బీఆర్‌ఎస్ నాయకులు బుధవారం మంథని పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్, బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు నిర్వహించిన ఈ కార్యక్రమంలో 420 హామీల ఫ్లెక్సీలు ప్రదర్శించి, “బాకీ కార్డులు” పంపిణీ చేశారు. మాజీ ఎమ్మెల్యే పుట్ట మధూకర్ మాట్లాడుతూ, ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను 100 రోజుల్లో అమలు చేస్తామని చెప్పి, వెయ్యి రోజులు గడిచినా పూర్తి స్థాయిలో అమలు చేయలేదని విమర్శించారు. మహిళలకు నెలకు రూ.2,500, రూ.500కే గ్యాస్ సిలిండర్, రైతు భరోసా, రైతు కూలీలకు ఆర్థిక సహాయం, వడ్లకు బోనస్, గృహజ్యోతి తదితర హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు.మంథని నియోజకవర్గ అభివృద్ధి, రోడ్ల విస్తరణ, ఇందిరమ్మ ఇళ్లు, ప్రభుత్వ పాఠశాలల వసతులు వంటి అంశాలపైనా ఆయన కాంగ్రెస్ ప్రభుత్వం, స్థానిక ఎమ్మెల్యేపై విమర్శలు గుప్పించారు. ఆరు గ్యారెంటీలను అమలు చేసిన తర్వాతే ప్రజల వద్దకు ఓట్లు అడగాలని పుట్ట మధూకర్ డిమాండ్ చేశారు.

జక్కు శ్రీహర్షిణి రాకేష్ విమర్శలు

జయశంకర్ భూపాలపల్లి జిల్లా పరిషత్ మాజీ చైర్‌పర్సన్ జక్కు శ్రీహర్షిణి రాకేష్ మాట్లాడుతూ, కాంగ్రెస్ ప్రభుత్వం మంథని ప్రజలతో పాటు రాష్ట్ర ప్రజలను హామీల పేరుతో మోసం చేసిందని ఆరోపించారు. మహాలక్ష్మి పథకం మినహా మిగిలిన గ్యారెంటీల అమలులో ప్రభుత్వం విఫలమైందని ఆమె అన్నారు.ఆరు గ్యారెంటీలు, 420 హామీలు పూర్తిగా అమలు చేసే వరకు బీఆర్‌ఎస్ పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు.

📲 వార్తను షేర్ చేయండి
🟢 WhatsApp🔵 Facebook
👁 Views: 26🔗 Shares: 1👍 Likes: 0
🇮🇳 జాతీయ స్థాయి రిపోర్టర్ నియామకంమీ ప్రాంతం నుంచి AYUSH24 NEWS కోసం వార్తలను అందించండి.
AYUSH24 NEWS Reporter
1 published stories

AYUSH24 NEWS Reporter Network

మీ ప్రాంతం నుంచి వార్తలు అందించాలనుకుంటున్నారా? మా Reporter Networkలో చేరండి.

Become a Reporter →

More News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *