లింగమంతుల స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించిన ఎమ్మెల్యే బాలు నాయక్
ప్రతి పేద కుటుంబానికి సొంతింటి కల సాకారం చేయడమే ప్రజా ప్రభుత్వ లక్ష్యం
చింతపల్లి, సెప్టెంబర్ 3 | అయుష్ 24 న్యూస్
చింతపల్లి మండలం ఉప్పరిపల్లి గ్రామంలో బోనాల పండుగ సందర్భంగా దేవరకొండ ఎమ్మెల్యే శ్రీ నేనావత్ బాలు నాయక్ లింగమంతుల స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా దేవరకొండ నియోజకవర్గ ప్రజలంతా సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో సుభిక్షంగా ఉండాలని స్వామివారిని ప్రార్థించారు.

అనంతరం గ్రామంలో ప్రజా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఇందిరమ్మ ఇళ్ల పథకం ద్వారా నిర్మించిన నూతన గృహాల గృహప్రవేశ కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొన్నారు. వడ్లకొండ శంకర్–నిర్మల, బండ్ల వెంకటయ్య–లక్ష్మమ్మ కుటుంబాల నూతన గృహప్రవేశ కార్యక్రమాలకు హాజరై వారికి శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే బాలు నాయక్ మాట్లాడుతూ.. పేద, మధ్యతరగతి కుటుంబాల సొంతింటి కలను సాకారం చేయడమే కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వ లక్ష్యమని అన్నారు. అర్హులైన ప్రతి కుటుంబానికి సంక్షేమ పథకాల ఫలాలు అందేలా ప్రభుత్వం కృషి చేస్తోందని తెలిపారు.

ఇందిరమ్మ ఇళ్ల పథకం ద్వారా నిరుపేదల జీవితాల్లో కొత్త వెలుగులు నింపుతున్నామని ఎమ్మెల్యే పేర్కొన్నారు. బోనాల పండుగ రోజునే పేద కుటుంబాలు తమ సొంతింట్లో గృహప్రవేశం చేయడం ఆనందంగా ఉందన్నారు. ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
ఈ కార్యక్రమంలో మాల్ మార్కెట్ కమిటీ చైర్మన్ దొంతం అలివేలు సంజీవరెడ్డి, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జటావత్ హరి నాయక్, మాజీ ఎంపీపీ కొండూరు పవన్‌కుమార్, జిల్లా ప్రధాన కార్యదర్శి ఎరుకల వెంకటయ్య గౌడ్, మాజీ మండల అధ్యక్షుడు అంగిరేకుల నాగభూషణం, స్థానిక సర్పంచ్ మెండే వెంకట్ యాదవ్, ఉప సర్పంచ్ బాలాగోని అలివేలు–దేవయ్య, మాజీ ఎంపీటీసీ గుణమోని కొండల్ యాదవ్, చందంపేట మండల అధ్యక్షుడు దొండేటి మల్లారెడ్డి, యూత్ కాంగ్రెస్ నియోజకవర్గ అధ్యక్షుడు కిన్నెర హరికృష్ణ తదితరులు పాల్గొన్నారు.

వీరితో పాటు మెండే బిక్షం, ఉజ్జిని రవీందర్రావు, జనార్ధన్‌రావు, నిర్మల్‌రావు, మెండే శ్రీను, శ్రీశైలం, దశరథ, లింగయ్య, సైదులు తదితర కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
— అయుష్ 24 న్యూస్
ది వాయిస్ ఆఫ్ ట్రూత్










Leave a Reply