అరెస్టులతో ఉద్యమాలను అణచలేరు: జనసేన
దేవరకొండ, సెప్టెంబర్ 5, అయుష్ 24 న్యూస్:
నల్గొండ జిల్లాలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటన సందర్భంగా జనసేన పార్టీ సీనియర్ నాయకుడు కొర్ర చందు నాయక్‌ను పోలీసులు ముందస్తుగా హౌస్ అరెస్ట్ చేసి, పోలీస్ స్టేషన్‌కు తరలించడాన్ని జనసేన పార్టీ తెలంగాణ రాష్ట్ర విభాగం తీవ్రంగా ఖండించింది.
ఈ సందర్భంగా జనసేన పార్టీ నాయకులు మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వానికి నిరసన గళాలంటే ఎందుకంత భయమని ప్రశ్నించారు. చందు నాయక్‌ను ముందస్తుగా నిర్బంధించడం ప్రజాస్వామ్య హక్కులను హరించే చర్యగా వారు అభివర్ణించారు.
ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో ప్రభుత్వం విఫలమైందని ఆరోపించిన జనసేన నాయకులు.. ప్రభుత్వాన్ని ప్రశ్నించే గొంతులను పోలీసు బలగాలతో అణచివేయాలని చూడటం సరైన విధానం కాదన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి హామీలు ఇవ్వడంపై ఉన్న శ్రద్ధ వాటి అమలుపై కూడా ఉండాలని సూచించారు.
హామీల అమలుపై దృష్టి పెట్టకుండా ప్రతిపక్షాలు, ప్రజా సంఘాలు ప్రశ్నించకుండా ముందస్తు అరెస్టులు, హౌస్ అరెస్టులకు పాల్పడటం సరికాదని జనసేన పేర్కొంది. అరెస్టులతో ప్రజా ఉద్యమాలను ఆపలేరని, ప్రజాక్షేత్రంలో ప్రభుత్వ విధానాలను ప్రశ్నిస్తూనే ఉంటామని స్పష్టం చేసింది.
రైతులు, యువత, ప్రజలకు ఇచ్చిన హామీల అమలుపై ప్రభుత్వం సమాధానం చెప్పాలని జనసేన పార్టీ డిమాండ్ చేసింది. ముందస్తు నిర్బంధాలతో భయపెట్టాలని చూస్తే జనసేన చూస్తూ ఊరుకోదని హెచ్చరించింది.
కొర్ర చందు నాయక్‌పై విధించిన నిర్బంధాన్ని తక్షణమే తొలగించి, ప్రజలకు ఇచ్చిన హామీల అమలుపై కాంగ్రెస్ ప్రభుత్వం దృష్టి సారించాలని జనసేన పార్టీ తెలంగాణ రాష్ట్ర విభాగం డిమాండ్ చేసింది.



Musini.Anjan





Leave a Reply