రూ.29 లక్షల డీఎంఎఫ్టీ నిధులతో నిర్మాణం: సర్పంచ్ దండెవేన సంధ్య బానేష్
మంథని, సెప్టెంబర్ 6, అయుష్ 24 న్యూస్: మంథని మండలం గుంజపడుగు గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల (జెడ్పీహెచ్ఎస్) కాంపౌండ్ వాల్ నిర్మాణానికి ఆదివారం గ్రామ సర్పంచ్ దండెవేన సంధ్య బానేష్ భూమిపూజ చేశారు.
ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ.. ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, శ్రీను బాబు సహకారంతో డీఎంఎఫ్టీ నిధులు రూ.29 లక్షలు మంజూరయ్యాయని తెలిపారు. ఈ నిధులతో పాఠశాల కాంపౌండ్ వాల్ నిర్మాణం చేపట్టనున్నట్లు వెల్లడించారు.
గుంజపడుగు గ్రామాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లేందుకు మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, శ్రీను బాబు సహకారం అందిస్తున్నారని సర్పంచ్ పేర్కొన్నారు. గ్రామ అభివృద్ధికి సహకరిస్తున్న వారికి గ్రామ ప్రజల తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
పాఠశాల వసతుల మెరుగుదలకు చర్యలు
కాంపౌండ్ వాల్ నిర్మాణంతో పాఠశాల ప్రాంగణానికి రక్షణతో పాటు విద్యార్థులకు మరింత సురక్షితమైన వాతావరణం ఏర్పడుతుందని స్థానికులు పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ ఎలుక లక్ష్మి, వార్డు సభ్యురాలు బోగే రాజేశ్వరి, పీఆర్ ఏఈ జగదీష్, బొల్లి సమ్మయ్య, ఇందారపు సదయ్య, కాసిపేట శ్రీకాంత్‌తో పాటు గ్రామ ప్రజలు పాల్గొన్నారు.










Leave a Reply